Ankit Love: జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (JKNPP) వ్యవస్థాపకుడు భీమ్ సింగ్ కుమారుడు అంకిత్ లవ్ ను ప్రభుత్వ బ్లాక్ లిస్టు నుంచి తొలగించింది. గతేడాది లండన్‌లో ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నందుకు అంకిత్ ను భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉంటున్న ఆయన తల్లి చనిపోయింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఎమర్జెన్సీ వీసా కోసం ప్రధాని నరేంద్ర మోడీని క్షమాపణలు కోరతూ లేఖ రాశాడు.