JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JPSC Exams: జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన పరీక్షలు, వాటి ఆధారంగా జరిగిన నియామకాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన పలువురు అభ్యర్థులకు ఊరట లభించింది. జస్టిస్ దీపక్ రోషన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. JPSC పరీక్షలు, నియామకాల రద్దును సవాలు చేస్తూ సౌరభ్ సింగ్, అవధేశ్ కుమార్, దీప్‌మాలా, సోనం కుమారి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాదులు ఇంద్రజీత్ సిన్హా, అమృతాంశ్ వాట్స్ వాదనలు వినిపించారు.
39 పరీక్షలు రద్దు.. ఆరు పరీక్షలు వాయిదా
పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 39 JPSC పరీక్షలను రద్దు చేయడంతో పాటు మరో ఆరు పరీక్షలను వాయిదా వేసింది. ఇందులో ఇటీవల నిర్వహించిన నియామక పరీక్షలతో పాటు గతంలో జరిగిన పలు పరీక్షలు కూడా ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, సివిల్ జడ్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫారెస్ట్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన పరీక్షలు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి. 2025, 2026 నోటిఫికేషన్లతో పాటు అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన కొన్ని నియామక ప్రక్రియలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల ఆందోళన
JPSC పరీక్షల్లో ఎంపికై ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,000 మంది అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాంచీలో ఆందోళన చేపట్టిన అభ్యర్థులు.. ఇతరుల అక్రమాలకు తమను బాధ్యులను చేయడం సరికాదని పేర్కొన్నారు. ఆర్థిక, హోం, రవాణా, కార్మిక, సమాచార-ప్రజా సంబంధాల శాఖల్లో ఇప్పటికే పలువురు ఉద్యోగాల్లో చేరినట్లు అభ్యర్థులు తెలిపారు. కొందరు JPSC ద్వారా ఉద్యోగాలు రావడంతో గతంలో చేస్తున్న ఇతర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగాలను కూడా వదులుకున్నామని చెప్పారు.
అక్రమాలపై విచారణకు అభ్యంతరం లేదు
పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరపడాన్ని తాము వ్యతిరేకించడం లేదని అభ్యర్థులు స్పష్టం చేశారు. అయితే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మొత్తం పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయితీగా ఎంపికైన అభ్యర్థులకు నష్టం జరుగుతుందని వాదించారు. తాము చట్టబద్ధమైన ఎంపిక ప్రక్రియ ద్వారా ఉద్యోగాలు పొందామని, ఇతరుల తప్పిదాల కారణంగా తమ నియామకాలను రద్దు చేయడం అన్యాయమని అభ్యర్థులు పేర్కొన్నారు.
JSSC-CGL రద్దుపైనా తీవ్ర వ్యతిరేకత
JSSC-CGL పరీక్ష రద్దు కూడా రాష్ట్రంలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులై వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందిన సుమారు 2,000 మంది అభ్యర్థులు రాంచీలో ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పరీక్ష రద్దును ప్రకటించిన మరుసటి రోజే అభ్యర్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర సచివాలయం నుంచి బిర్సా చౌక్ వరకు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని, అయితే మొత్తం పరీక్షను రద్దు చేసి తమ భవిష్యత్తును దెబ్బతీయవద్దని వారు డిమాండ్ చేశారు.
హైకోర్టు స్టేతో అభ్యర్థులకు ఊరట
ప్రభుత్వం తీసుకున్న పరీక్షల రద్దు నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడంతో ఇప్పటికే నియమితులైన అభ్యర్థులకు తాత్కాలికంగా ఊరట లభించింది. అయితే పరీక్షల్లో అవకతవకల ఆరోపణలు, నియామకాల చట్టబద్ధతపై తదుపరి న్యాయ ప్రక్రియ ఎలా కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు తాజా ఆదేశాలతో JPSC పరీక్షల రద్దు అంశం మరోసారి న్యాయపరిశీలనలోకి వచ్చింది. ప్రభుత్వం, అభ్యర్థుల వాదనలు, పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?