Amit shah Fake video Case: రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయింది. అయితే ఈ కేసును ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫేక్ వీడియోను కాంగ్రెస్ అధికార ఎక్స్ హ్యాండిల్స్ షేర్ చేయడంతో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు విస్తృతంగా పంచుకున్నారు. దీనిపై ఢిల్లీ పోలీసుల వద్ద ఫిర్యాదు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
Read Also: Yogi Adityanath: ‘‘అంత్యక్రియలకు నలుగురు కావాలి, కానీ’’.. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన యోగి..
తాజాగా చట్టపరమైన చర్యల్లో భాగంగా జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ఎక్స్ హ్యాండిల్ నిలిపేయబడింది. ఈ హ్యాండిల్ నుంచి అమిత్ షా డీప్ ఫేక్ మార్ఫిండ్ వీడియో పోస్ట్ చేయబడింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పిటన్లు ఓ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి వైరల్ చేశారు. దీనిపై హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు చర్యల్ని ప్రారంభించారు. నిజానికి మతప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని అమిత్ షా చెప్పిన వీడియోను మార్ఫింగ్ చేసి తప్పుడు వీడియోను ప్రచారంలోకి తెచ్చారు.
ఇదిలా ఉంటే ఈ వీడియోకు సంబంధించిన కేసులో జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్, పీసీసీ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్‌కి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 2న తమ ముందు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. తనకు నోటీసులు అందినట్లు ఠాకూర్ ధ్రువీకరించారు. నాకు నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని, ఇది అరాచకం తప్ప మరోటి కాదని ఠాకూర్ అన్నారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే, వారు ముందుగా నా ఎక్స్ ఖాతాలోని కంటెంట్‌ని ధ్రువీకరించాలి, ఎన్నికల ప్రచారం పీక్స్‌లో ఉన్నప్పుడు, నా ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కోరుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.