ED: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్‌తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్‌లో ఉంది.
అంతకుముందు భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మరో కేసులో సీఎం సొరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరుతూ ఈడీ శనివారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. జార్ఖండ్ సీఎం తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇదే చివరి అవకాశం అని సమన్లలో ఈడీ పేర్కొంది. అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమని సొరెన్ ఆరోపించారు. తన ఆస్తుల వివరాలను ఇప్పటికే ఇచ్చానని ఈడీకి లేఖ రాశారు. తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
Read Also: BYD: టెస్లాను అధిగమించిన చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ బీవైడీ..
సాహెబ్ గంజ్ జిల్లా అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై సీఎం సోరెన్‌పై విచారణ జరుగుతోంది. గనులు, భూగర్భ శాఖలను నిర్వహిస్తున్న సీఎం తనకు తానే మైనింగ్ లీజులు ఇచ్చుకుని ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.
మరోవైపు సొరెన్ భార్య కల్పనా సొరెన్ గాండే అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సర్పరాజ్ అహ్మద్ సోమవారం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ విచారణలో ఏదైనా పరిణామం ఎదురైతే కల్పనా సొరెన్ గండే నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణల్ని జేఎంఎం ఖండించింది.
తాజావార్తలు
-
Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!