META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం రేగుతోంది. మాజీ సీఎం సిద్ధరామయ్య స్టింగ్ వీడియోల వివాదం కొనసాగుతుండగానే… ప్రస్తుత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా మెటా స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగించి తనపై రహస్యంగా స్టింగ్ ఆపరేషన్ చేసేందుకు ప్రయత్నించారని ఆయన బాంబ్ పేల్చారు. తనతో పాటు కేరళ కాంగ్రెస్ సీఎం వీడీ సతీశన్‌పై కూడా ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. అసలు డీకే శివకుమార్ చెబుతున్న ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి? ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎవరు? కర్ణాటక పాలిటిక్స్ లో తెరవెనుక ఏం జరుగుతోంది?
కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డీకే శివకుమార్ కు ఈ స్టింగ్ ఆపరేషన్ల వివాదం అతిపెద్ద రాజకీయ సవాలుగా మారింది. కన్నడ బ్రాడ్‌కాస్టర్ ఏషియానెట్ సువర్ణ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. తనను కలిసేందుకు వచ్చిన ఓ పారిశ్రామికవేత్త మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించడం అనుమానాలకు తావిచ్చిందని డీకేఎస్ తెలిపారు. తనపైన, కేరళ సీఎం వీడీ సతీశన్పైన మాత్రమే స్టింగ్ ఆపరేషన్ కు ప్రయత్నించారని… బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యమంత్రులపై ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న భారీ కుట్రలో ఇది భాగమని కర్ణాటక సీఎం ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారం ఎలా జరిగిందనే దానిపై డీకే శివకుమార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అధికారుల ద్వారా అపాయింట్మెంట్ తీసుకున్న సదరు పారిశ్రామికవేత్త… ముందుగా వ్యాపార విషయాలే మాట్లాడారు. ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయాల వైపు సంభాషణను మళ్లించి… బూత్ స్థాయి వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై చర్చించడం మొదలుపెట్టారు. మాటల తీరు మారడం, అతడు ధరించిన కళ్లద్దాలు చూసి అనుమానం వచ్చిన డీకేఎస్… సదరు వ్యక్తి నేపథ్యంపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఓ కేంద్ర మంత్రితో సమావేశమైనప్పుడు ఆ పారిశ్రామికవేత్త ఈ గ్లాసెస్ ధరించలేదని.. కేవలం తనను, వీడీ సతీశన్‌ను కలిసినప్పుడు మాత్రమే ఆ మెటా గ్లాసెస్ పెట్టుకున్నారని డీకే వాదన.
Also Read
దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని చెబుతున్న డీకేఎస్… ప్రస్తుతానికి ఆ వివరాలు బయటపెట్టడం లేదు. వారి పేర్లు, వివరాలు, రికార్డులు తన వద్ద భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తగిన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని తేల్చి చెప్పారు. ఇలాంటి వలల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కేబినెట్ సహచరులను ఆయన ఇప్పటికే హెచ్చరించారు. పర్సనల్ అసిస్టెంట్స్, ఫోన్ కాల్స్ ద్వారా వల వేసే ప్రమాదం ఉందని కేబినెట్ భేటీలో మంత్రులను అప్రమత్తం చేశారు. కుట్రదారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో బయటపెట్టకపోయినా… అవసరమైన అన్ని ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యకు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోల రగడ కొనసాగుతున్న వేళ… డీకే శివకుమార్ తాజా ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. 2011 నాటి క్లిప్స్ ఉపయోగించి సిద్ధరామయ్యను పదవి నుంచి దించేందుకు యత్నించారని జేడీఎస్ చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. సిద్ధరామయ్యపై స్టింగ్ కుట్ర వెనుక డీకేఎస్ హస్తం ఉందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ.. డీకే తీవ్రంగా ఖండించారు. మరోవైపు పది మంది మంత్రులు, సీఎంవోను టార్గెట్ చేసేందుకు ఓ కేంద్ర మంత్రి, కర్ణాటక బీజేపీ నేత ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఫండింగ్ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గణిగ ఆరోపిస్తున్నారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఓ పెన్ డ్రైవ్ కూడా చూపిస్తున్నారు.
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రెయిన్ బో మెటా గ్లాసెస్… ప్రైవసీకి ప్రమాదకరంగా మారాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఈ గ్లాసులు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీకే శివకుమార్ చెప్పిందే నిజమైతే… మరి ఇద్దరు సౌత్ సీఎంపై మెగా గ్లాసుల ద్వారా స్టింగ్ ఆపరేషన్ చేసింది ఎవరు? చేయించింది ఎవరు?
తాజావార్తలు
-
META Smart Glasses: రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ల దుమారం.. ఆ మెటా గ్లాసెస్ మిస్టరీ ఏంటి?
-
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
-
SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ కంటే 5-6 రెట్లు ఎక్కువ.. ‘వారణాసి’పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!