Karnataka Sex Scandal: సెక్స్ వీడియో కేసులో ముందస్తు బెయిల్ కోసం హెచ్‌డీ రేవణ్ణ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Sex Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండర్ కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మహిళల్ని లైంగికంగా వేధించిన కేసులో ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ నిందితులుగా ఉన్నారు. రేవణ్ణ ఇంట్లో పనిచేసే 47 మహిళ వీరిద్దరిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన 3000 వీడియోలు ప్రస్తుత ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హహస్ జిల్లాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజ్వల్ బెంగళూర్ నుంచి జర్మనీ లోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి వెళ్లిపోయాడు. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తోంది.
Read Also: Balka Suman : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది
Also Read
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
మరోవైపు ఈ కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్‌ని జేడీఎస్ నుంచి బహిష్కరించారు. ఇదిలా ఉంటే హెచ్‌డీ రేవణ్ణ ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరులోని సెషన్స్ కోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, కేసు రేపటికి వాయిదా పడింది. ప్రజ్వల్ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు. అయితే, ఈ కేసులో తన పేరు, తన తండ్రి పేరును ఎందుకు లాగుతున్నారని, ఇది రేవణ్ణ కుటుంబానికి చెందిన విషయమని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని శిక్షించాలని కోరారు.
విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌ని విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని సిట్ కోరింది. రాష్ట్రప్రభుత్వం అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఈ పరిణామం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దూరంగా ఉంటున్నారు. ఈ సెక్స్ స్కాండల్‌పై తొలిసారిగా ప్రజ్వల్ స్పందిస్తూ.. నిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..