Site icon NTV Telugu

Jammu kashmir Encounter: సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. సైనికుడి మృతి

Attca

Attca

జమ్మూకశ్మీర్‌ కాల్పులతో మర్మోగింది. కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. శనివారం కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక సైనికుడు ప్రాణాలు వదిలాడు. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలకు చిక్కి ఉంటారని తెలుస్తోంది. శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మరణించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: Game Changer: హమ్మయ్య రామ్ చరణ్ పని పూర్తయింది!

ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కుల్గామ్ జిల్లాలోని మోడెర్గామ్ గ్రామంలో కాల్పులు జరిగాయి. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు రహస్య స్థావరంలో మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. టెర్రరిస్టులను మట్టుబెట్టే పనిలో భద్రతా బలగాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Assam Flood: అస్సాంలో క్లిష్ట పరిస్థితులు.. ఎటు చూసినా నీళ్లే.. జనాలు తీవ్ర ఇక్కట్లు

Exit mobile version