Congress: కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. 50 మంది సీనియర్ నేతల రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu and Kashmir Congress leaders resign: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కపిల్ సిబల్, జ్యోతిరాథిత్యా సింథియా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పి వేరే పార్టీల్లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పవచ్చు. ఆజాద్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నారు.
Read Also: Kartikeya 2: పవన్ కోసం నిఖిల్ ని పక్కకు తప్పిస్తారా..?
Also Read
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
తాజాగా ఆజాద్ రాజీనామాకు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ అంతటా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు వరసగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ తో సహా 50 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామాలు పంపించినట్లు సమాచారం. తారా చంద్ తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌లతో సహా పలువురు తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా తమ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సోనియా గాంధీకి తమ రాజీనామాలను పంపుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు పంచాయతీ, బ్లాక్ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు , పలు మున్సిపల్ కార్పొరేటర్లు ఆజాద్ రాజీనామాకు మద్దతుగా ఇప్పటికే రాజీనామాలు చేశారు.
73 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీల సంస్థాగత మార్పులతో పాటు నాయకత్వం ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్న జీ-23 గ్రూపులో ఆజాద్ ప్రముఖంగా ఉన్నారు.
తాజావార్తలు
-
ViewSonic Google TV Series: భారత్‌లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!