Jamili Elections: దేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది. ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఎంపీలు అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై.. సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు.
Read also: IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా
గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమైన జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమని పార్లమెంట్‌లో తేల్చి చెప్పింది. ప్రస్తుతం దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు పార్లమెంట్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జమిలి ఎన్నికలపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలతో లాభాలు ఉన్నప్పటికీ, ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదని మేఘ్వాల్ తెలిపారు. జమిలి ఎన్నికలతో లాభాలున్నప్పటికీ అనేక అవరోధాలు కూడా ఉన్నాయని.. జమిలి ఎన్నికలు జరపాలంటే కీలకమైన 5 రాజ్యాంగ సవరణలు అవసరమని కేంద్ర మంత్రి అన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు అందుకు సమ్మతించాల్సి ఉంటుందని.. పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీప్యాట్‌ల అవసరం ఉంటుందన్నారు. ఒకేసారి అన్ని చోట్లా భద్రతా బలగాల మోహరింపు సాధ్యం కాకపోవచ్చని.. జమిలి ఎన్నికలపై న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన చేసిందని.. సీఈసీ సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని తెలిపిన కేంద్రమంత్రి.. తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర మేఘ్వాల్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలను జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు.