IndvsWi: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న టీమిండియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇక, టీమిండియా వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కే తుది జట్టులో చోటు దక్కంది. దీంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితమ్యాడు. స్పిన్ కోటాలోనూ కుల్దీప్‌ను టీమ్ లోకి తీసుకోగా.. చాహల్ డగౌట్ కి పరిమితమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది.
Read Also: Kushi: సామ్ ను రౌడీ హీరో ఎక్కడా వదలడం లేదుగా
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
- Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
అయితే, టెస్టు సిరీస్‌ని 1-0తో కైవసం చేసుకున్న భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఈ వన్డే సిరీస్‌ని చూస్తోంది. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో అదరగొట్టారు. అయితే శుభ్ మన్ గిల్ ఈ టెస్టు సిరీస్‌లో పెద్దగా రాణింకలేకపోయాడు. ఈ ఏడాది వన్డేల్లో దుమ్మురేపిన గిల్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో కొనసాగుతున్నాడు. ఈ సిరీస్ పర్ఫామెన్స్ కూడా బాగుంటే, అతను టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
Read Also: Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఇషాన్ కిషన్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం దాదాపు ఖాయమే అయినట్లు కనిపిస్తుంది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో చోటు దక్కించుకునేందుకు సంజూ శాంసన్‌కి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం. గత ఏడాది వన్డేల్లో ఆడినంత వరకూ సంజూ శాంసన్ బాగానే ఆడాడు.. అయితే తొలి వన్డేలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌కి తుది జట్టులో అవకాశం ఇచ్చింది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే.. అంబటి ధ్వజం
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వచ్చేయడంతో వన్డే సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్, జయ్‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. రెండో టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, నేటి మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగ్రేటం చేస్తున్నాడు.. అయితే, ఇవాళ్టి మ్యాచ్లో వెస్టిండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్, వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!