Haryana Elections: అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఊహించని షాక్!
- హర్యానాలో కాంగ్రెస్‌కు ఊహించని షాక్!
- అధికారాన్ని దూరం చేసిన రాహుల్ ‘జిలేబీ’ వ్యాఖ్యలు
- తాజాగా ట్రెండింగ్ చేస్తోన్న బీజేపీ సోషల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో ఈసారి హస్తం పార్టీదే అధికారమని.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని సర్వేలన్నీ ఊదరగొట్టాయి. రెండు రోజులు గడిచే సరికి అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌లో ఏ ఒక్కటి నిజం కాలేదు. తిరిగి హర్యానా ప్రజలు కమలం పార్టీనే కోరుకున్నారు. హస్తం పార్టీని తిరిగి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా జిలేబీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
రాహుల్ గాంధీ హర్యానాలోని గోహనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ సింగ్ హూడా.. రాహుల్‌కు జిలేబీ తినిపించారు. జిలేబీ రుచి చూశాక రాహుల్ ఒక్కసారిగా మైమరిచారు. అద్భుతం అంటూ గొప్పగా పొగిడారు. తన జీవితంలో ఇంత అద్భుతమైన.. రుచికరమైన జిలేబీని ఎప్పుడూ తినలేదని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పబ్లిక్ మీటింగ్‌లో దీని గురించి ప్రసంగం చేశారు. తాను కారులో వస్తూ హర్యానా జిలేబీ రుచి చూశానని.. తన సోదరికి కూడా ఒక బాక్స్ తీసుకొస్తానని మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదే అంశాన్ని మరింత సాగదీస్తూ.. ఇలాంటి జిలేబీలను ఫ్యాక్టరీల్లో తయారు చేసి దేశంలోనే ప్రతి ప్రాంతానికి వెళ్లాలని.. అంతేకాకుండా జపాన్, అమెరికాతో పాటు అన్ని దేశాలకు ఎగుమతి చేయాలని.. దీని ద్వారా అనేక మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. అనంతరం మోడీని టార్గెట్ చేస్తూ.. అదానీ, అంబానీలకు దేశాన్ని దోచుపెడుతున్నారని.. అదే జిలేబీ తయారు చేసే సంస్థలను ప్రోత్సహిస్తే.. ఎంతో మంది కార్మికులకు జీవనోపాధి దొరుకుతుందని రాహుల్ చెప్పుకొచ్చారు. ఇలా జిలేబీ అంశం సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ జిలేబీ వ్యాఖ్యలను బీజేపీ విపరీతంగా ట్రోలింగ్ చేసింది. జిలేబీ ఫ్యాక్టరీలంటూ వ్యంగ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసింది. తాజాగా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ అంతా రివర్స్ అయిపోయింది. ఫలితాలు తారుమారు అయిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించిన వాళ్లంతా ఇప్పుడు జిలేబీ వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ వ్యాఖ్యలు కొంపముంచాయంటూ కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుతున్నారు. దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే చూసినట్లుగా తాజా ఫలితాలను బట్టి అర్థమవుతోంది. అంతే కాకుండా కుల గణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. మొత్తానికి రాహుల్‌కి తీపి వార్త కాస్త.. చేదువార్త అయిందని బీజేపీ ట్రెండింగ్ చేస్తోంది.
“Modi is stopping small scale jalebi vendors from building jalebi factories. I want these vendors to be empowered enough to build their own jalebi factories” – Rahul Ghandy
As per this Jan Nayak , Jalebis are made in factories 🤣🤣🤣 pic.twitter.com/PhX9twDpKx
— Amitabh Chaudhary (@MithilaWaala) October 2, 2024
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!