Poonch Attack: జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలో గురువారం భీంజెర్ గలి నుంచి సాంగియోట్ కు వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పాటు గ్రెనెడ్స్ తో దాడి చేశారు. ఈ ఘటనలో భారత సైన్యానికి చెందిన ఐదుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట సాగిస్తున్నాయి. సైన్యంతో పాటు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.
Read Also: chhattisgarh: 20 ఏళ్ల క్రితం హత్య చేశా.. ఇప్పుడు కలలో వేధిస్తున్నాడు.. ఓ వ్యక్తి వింత ఆరోపణ
మరికొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్ వేదికగా జీ-20 సదస్సు జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇలా దాడి చేసి తమ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జరిగిన ఈ దాడి తమపనే అని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ప్రకటించింది. పూంచ్ జిల్లాలోని రాజౌరి సెక్టార్ లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఉగ్రవాద ఘటన చోటు చేసుకుంది. కాల్పులతో పాటు గ్రేడేడ్స్ దాడి జరగడంతో వాహనంలో మంటలు చెలరేగాయి.
2019లో పుల్వామా దాడిలో తర్వాత జైషే మహ్మద్ తాజా దాడికి పాల్పడింది. పుల్వామా అటాక్స్ తరువాత భారత్ వైమానికి దాడులు చేసింది. పాకిస్తాన్ మెయిన్ ల్యాండ్ లోకి వెళ్లి బాలాకోట్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి తర్వాత కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాద చర్యలను భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయి. అయితే జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు నేరుగా దాడులు చేయకుండా వాటి అనుబంధ సంస్థలతో, కాశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే పేరుతో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ లో హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. వలసకూలీలు, హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్నాయి.