India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- మార్చి 2027 నుంచి IST తప్పనిసరి
- దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IST Mandatory From March 2027: భారతదేశంలో సమయ వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి 2027 నుంచి దేశంలోని అన్ని సంస్థలు చట్టపరమైన, వాణిజ్య, డిజిటల్, పరిపాలనా అవసరాల కోసం భారత ప్రామాణిక సమయం (Indian Standard Time – IST)ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్, 2026ను ప్రకటించింది. లీగల్ మెట్రాలజీ రూల్స్ కింద ఈ నిబంధనలను తీసుకొచ్చారు. గెజిట్‌లో నోటిఫికేషన్ ప్రచురించిన 180 రోజుల తర్వాత ఇవి అమల్లోకి వస్తాయి. దీంతో సుమారుగా మార్చి 2027 నుంచి IST వినియోగం తప్పనిసరి కానుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై సంబంధిత చట్టం ప్రకారం జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.
అన్ని అధికారిక పత్రాల్లో IST తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేకంగా మినహాయింపు పొందిన సందర్భాలు మినహా.. దేశంలోని అన్ని చట్టపరమైన, పరిపాలనా, అధికారిక పత్రాలు, రికార్డులు భారత ప్రామాణిక సమయాన్ని ఆధారంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్యం, రవాణా, ప్రభుత్వ పరిపాలన, చట్టపరమైన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల్లో కూడా ISTను ప్రామాణిక సమయ సూచనగా ఉపయోగించాల్సి ఉంటుంది. అధికారిక అవసరాల కోసం ISTకు బదులుగా ఇతర సమయ సూచనను ఉపయోగించడం, ప్రదర్శించడం లేదా నమోదు చేయడాన్ని నిబంధనలు నిషేధిస్తున్నాయి.
Also Read
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
- Mohan Bhagwat: ‘భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
కొన్ని సందర్భాల్లో మినహాయింపులు
అయితే అన్ని సందర్భాల్లోనూ IST మాత్రమే ఉపయోగించాలనే నిబంధనకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు ఫారిన్ టైమ్ జోన్ ని (Time Zone) స్పష్టంగా సూచించాల్సిన సందర్భాలు, శాస్త్రీయ పరిశోధనలు, నావిగేషన్‌కు సంబంధించిన అవసరాలు, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కార్యకలాపాలు, ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించిన ఇతర సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో ఇతర సమయ వనరులను ఉపయోగించేందుకు అనుమతి ఉండవచ్చు.
ఈ నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారు?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థలు అత్యంత ఖచ్చితమైన సమయ సమకాలీకరణపై ఆధారపడుతున్నాయి. కొన్ని కీలక రంగాల్లో మైక్రోసెకండ్ స్థాయి సమయ ఖచ్చితత్వం కూడా అవసరమవుతోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, టెలికాం నెట్‌వర్క్‌లు, 5G సేవలు, డిజిటల్ నావిగేషన్, విద్యుత్ పవర్ గ్రిడ్లు
డేటా సెంటర్లు వంటి కీలక మౌలిక సదుపాయాలు సమకాలీకరించిన గడియారాలపై ఆధారపడి పనిచేస్తున్నాయి. సమయాన్ని ఒకే ప్రమాణంతో నిర్వహించడం వల్ల లావాదేవీలను కచ్చితంగా నమోదు చేయడం, వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం పెంచడం, నెట్‌వర్క్‌ల విశ్వసనీయతను మెరుగుపరచడం సాధ్యమవుతుంది.
సైబర్ సెక్యూరిటీకి కూడా ప్రాధాన్యం
కొత్త నిబంధనల్లో సైబర్ రెసిలియన్స్కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అంటే సైబర్ దాడులు జరిగినప్పుడు వాటిని తట్టుకుని, సాధ్యమైనంత త్వరగా వ్యవస్థలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగల సామర్థ్యాన్ని పెంచడం. సంస్థలు తమ సమయ-సమకాలీకరణ వ్యవస్థలను సురక్షితంగా నిర్వహించాల్సి ఉంటుంది.
టైమ్ సింక్రనైజేషన్ వ్యవస్థలను సక్రమంగా అమలు చేయాలి.
స్పూఫింగ్, జామింగ్ వంటి దాడుల నుంచి నెట్‌వర్క్‌లను రక్షించాలి.
ఒకటి కంటే ఎక్కువ అధీకృత సమయ వనరులను ఉపయోగించాలి.
సమయ వ్యవస్థ విఫలమైనప్పుడు పనిచేసే అత్యవసర వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.
అవసరమైన చోట అటామిక్ క్లాక్‌ల వంటి అత్యంత ఖచ్చితమైన సమయ వనరులను ఉపయోగించాలి.
దేశవ్యాప్తంగా ఒకే సమయ ప్రమాణం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా సమయానికి ఒకే ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం. ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, టెలికాం, రవాణా, ప్రభుత్వ సేవలు, ఆర్థిక మార్కెట్లు వంటి రంగాల్లో సమయ వ్యత్యాసాల వల్ల తలెత్తే సమస్యలను తగ్గించడంలో ఇది కీలకంగా మారనుంది. గెజిట్ నోటిఫికేషన్ తర్వాత 180 రోజులకు నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. సంస్థలు తమ డిజిటల్, సాంకేతిక వ్యవస్థలను ISTకు అనుగుణంగా మార్చుకునేందుకు ముందుగానే సిద్ధం కావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!