ISIS Terrorists: ఎన్నికల హడావిడి, మరోవైపు ఐపీఎల్ ఫైనల్స్ ఇలా దేశమంతా కోలాహలం నిండి ఉండగా, ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారీ దాడికి కుట్ర పన్నింది. శ్రీలంకకు చెందిన వ్యక్తుల సాయంతో ఉగ్రదాడులు నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే మన ఇంటెలిజెన్స్, పోలీసు అధికారులు చాకచక్యంతో నలుగురు శ్రీలంక జాతీయులను అరెస్ట్ చేశారు. సోమవారం గుజరాత్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) నిన్న పక్కా సమచారంలో నలుగురిని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది. భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు నిందితులు అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పలు బృందాలను ఏర్పాటు చేసి పట్లుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Sambit Patra: “నోరుజారి” పశ్చాత్తాపం కోసం “ఉపవాసం” చేపట్టిన బీజేపీ నేత
ఈ నలుగురు ఉగ్రవాదులు నిన్న చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఇండిగో విమానంలో ఎక్కారని గుజరాత్ డీజీపీ వికాష్ సహాయ్ తెలిపారు. దక్షిణాది నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత, వీరి గుర్తింపును శ్రీలంక అధికారులతో ధృవీకరించిన తర్వాత అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నలుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో అబూ అనే వ్యక్తితో సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నారని, వీరిని భారత్‌లో ఉగ్రదాది చేయాలని ప్రోత్సహించాడని, వీరు ఆత్మాహుతి దాడికి కూడా ఒప్పుకున్నట్లు సహాయ్ చెప్పారు. అబు వీరికి శ్రీలంక కరెన్సీలో రూ. 4 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు.
నలుగురి మొబైల్స్‌లో అహ్మదాబాద్ సమీపంలోని నానాచిలోడాలోని కొన్ని ఆయుధాల ఫోటోలు మరియు లొకేషన్ డేటా లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఏటీఎస్ మూడు పాకిస్తానీ పిస్టల్స్, 20 కాట్రిడ్జ్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను పాకిస్తాన్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అనుమానితులైన మహ్మద్ నుస్రత్ (33), మహ్మద్ ఫరీష్ (35), మహ్మద్ నఫ్రాన్ (27), మహ్మద్ రష్దీన్ (43)లు యూదులు, క్రైస్తవులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, మరికొందరు హిందూ నేతలను టార్గెట్ చేసుకుని హత్యలు చేయాలని వీరు భావిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఉగ్రవాదుల్లో ఒకరికి పాకిస్తానీ వీసా కూడా ఉంది. ఇతను అబూను కలవడానికి వెళ్తున్నాడు. ఉగ్రవాదులు భారత్‌లోని కొంతమందితో టచ్‌లో ఉన్నట్లు కూడా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.