Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
- తాజ్ మహల్ సందర్శించిన అమెరికా విదేశాంగ కార్యదర్శి..
- చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవారు కాదు: ఇరాన్ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన తన భార్య జీనెట్ రూబియోతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సందర్శించారు. ఈ ఫోటోను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే, తాజ్ మహల్ సందర్శనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ రూబియోపై విమర్శలు చేసింది. తాజ్ మహల్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధాన్ని పంచుకుంది.
‘‘మార్కో రూబియోకు తాజ్ మహల్ చరిత్ర గురించి తెలిసి ఉంటే అక్కడ ఫోటోలకు ఫోజ్ ఇచ్చే వారు కాదు’’ అని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఒక ఇరానియన్ మహారాణి ప్రేమకు గుర్తుగా నిర్మించిన ఈ అద్భుతాన్ని ఇరాన్ ఆర్కిటెక్టులు రూపొందించారని, కానీ ఇదే సమయంలో ఇరాన్ చరిత్రను నాశనం చేస్తామని అమెరికా బెదిరిస్తోందని విమర్శించింది. ఇటీవల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ స్పందిస్తూ.. అమెరికా చరిత్ర కేవలం 250 ఏళ్లు మాత్రమే, కానీ ఇరాన్ నాగరికత వేల ఏళ్లది అని చెప్పింది.
Also Read
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
ఇరాన్, తాజ్ మహల్ సంబంధం..
మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం 1632లో తాజ్ మహల్‌ను కట్టించారు. ముంతాజ్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగమ్. ఈమె కుటుంబం పర్షియాకు చెందినది. ఆమె తాత మిర్జా ఘియాస్ బేగ్ ఇరాన్ నుంచి భారత్ వచ్చి మొఘల్ రాజసభలో కీలక స్థానంలో పనిచేశారు. తాజ్ మహల్ నిర్మాణం కూడా పర్షియన్ శైలిని పోలి ఉంటుంది. ఇరాన్ లోని షిరాజ్‌కు చెందిన కళాకారుడు అబ్దుల్ హక్ దీన్ని డిజైన్ చేసినట్లు చెబుతారు.
If Rubio knew the history or architecture, he wouldn't have posed for a picture here. This monument was built out for the love of emperor's Iranian wife, crafted by the genius of Iranian architects — meanwhile his government today threatens to wipe out Iranian civilization,… pic.twitter.com/zi4CNU3u7U
— Iran In Hyderabad (@IraninHyderabad) May 25, 2026
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?