Basmati Rice Exports: ఇరాన్ ఆంక్షలు.. బాస్మతి రైస్ ఎగుమతులకు బ్రేక్
- ఇరాన్‌లో కొనసాగుతున్న అనిశ్చితి..
- తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ప్రజలు నిరసనలు..
- ఇరాన్ ఆంక్షలు.. భారత బాస్మతి రైస్ ఎగుమతులకు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basmati Rice Exports: అణు, క్షిపణి కార్యక్రమాలు, మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు ప్రాంతీయ అస్థిరతకు ఇరాన్ మద్దతు ఇస్తోందనే ఆరోపణలతో అమెరికా, ఐక్యరాజ్య సమితి, పశ్చిమ దేశాలు టెహ్రాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించాయి. ఈ ఆర్థిక ఆంక్షల వల్ల చమురు ఎగుమతులు దెబ్బతిని, రియల్ కరెన్సీ పడిపోయి 40 శాతం ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులకు మరోసారి అనిశ్చితి ఏర్పడింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని బాస్మతి బియ్యం రైతులు, రైస్ మిల్లర్లపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే, అమెరికా ఆంక్షలు మరింత కఠినం అవ్వడంతో, ఇరానియన్ కరెన్సీ రియల్ విలువ భారీగా పతనం కావడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా మారింది. కాగా, ఇరాన్ రియల్ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరుకోవడంతో, ఆహార దిగుమతులపై ఇప్పటి వరకు కొనసాగుతున్న సబ్సిడీలను ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. దీంతో భారతీయ ఎగుమతిదారులు సరుకులను పంపేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా కనీసం రూ.2,000 కోట్ల విలువైన బాస్మతి బియ్యం అంతర్జాతీయ పోర్టుల్లోనే నిలిచిపోయింది.
Read Also: Iran: పూర్తిగా అదుపుతప్పిన ఇరాన్.. అగ్నికీలల్లో వాహనాలు, ఆస్తులు
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
ఇక, పంజాబ్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంజిత్ సింగ్ జోసన్ మాట్లాడుతూ.. ఇరాన్ కరెన్సీ రియల్ డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో క్షీణించడంతో, ఆహార దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. చాలా ఏళ్లుగా ఉన్న సబ్సిడీలను ఇరాన్ సర్కార్ రద్దు చేసిందన్నారు. దీనివల్ల బియ్యం ఎగుమతి చేయడం కఠినంగా మారిందని పేర్కొన్నాడు. ఇంతకు ముందు భారత్- ఇరాన్ మధ్య వాణిజ్యం బార్టర్ విధానంలో (వస్తువుల మార్పిడి ద్వారా) సాగేది.. అయితే భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో ఆ విధానం కూడా ఆగిపోయింది. అయినప్పటికీ, టీ, బాస్మతి బియ్యం, ఔషధాలు లాంటి ఆహార ఉత్పత్తులను భారత్ నుంచి ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. కానీ, తాజా పరిస్థితులతో ఈ దిగుమతులు కూడా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.
Read Also: Jaipur: మద్యం మత్తులో లగ్జరీ కారు డ్రైవర్ బీభత్సం.. 16 మందిని ఢీకొట్టిన వైనం.. ఒకరు మృతి!
బాస్మతి బియ్యానికి ఇరాన్ పెద్ద మార్కెట్
ఇరాన్ అనేది భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం సగటున 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని, సుమారు రూ.12,000 కోట్ల విలువకు ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో దాదాపు 40 శాతం పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచే సరఫరా అవుతుంది. కాగా, ఎగుమతుల్లో ఇలాగే అనిశ్చితి కొనసాగితే, ఇప్పటికే మిల్లర్లు నష్టాలను ఎదుర్కొంటుండగా, రాబోయే రోజుల్లో రైతులకు లభించే ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరెన్సీ పతనం ఎఫెక్ట్
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు డాలర్‌కు సుమారు 90,000 రియల్ మారకం రేటు ఉండేది. ప్రస్తుతం అది 1,50,000కు చేరుకోవడంతో, ఇరాన్‌కు దిగుమతులు చాలా ఖరీదు అయ్యాయి. ఇంతకు ముందు ఆహార దిగుమతుల కోసం ఇరాన్ ప్రభుత్వం డాలర్‌కు 28,500 రియల్ ప్రిఫరెన్షియల్ రేటును అందించేది. కానీ ఈ సౌకర్యాన్ని ఇప్పుడు పూర్తిగా ఉపసంహరించుకుంది. అయితే, ఇరాన్ సాధారణంగా జూన్ 21 తర్వాత విదేశీ దిగుమతులను నిలిపివేసి, సెప్టెంబర్‌లో మళ్లీ ప్రారంభిస్తుంది. ఈ మధ్యకాలంలో భారత ఎగుమతిదారులు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకునే వాళ్లు.. కానీ, ప్రస్తుతం ఇరాన్ లో అనిశ్చితి వల్ల ఈ సరఫరా చక్రం పూర్తిగా ఆగిపోయింది.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!