Indore: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో షాకింగ్ సంఘటన ఎదురైంది. హోంవర్క్ కారణంగా ఓ విద్యార్థి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇండోర్ లోని నందానగర్ ప్రాంతంలో జీ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు పాఠశాల భవనం మూడో అంతస్తుు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హోంవర్క్ చేయలేదని ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డాడు.
Read Also: Drinking water: కస్టమర్‌కి “రెగ్యులర్ వాటర్” ఇవ్వని కేఫ్.. రూ. 20,000 ఫైన్..
గురువారం ఉదయం పాఠశాలకు వచ్చి మేడపైకి వెళ్లి మూడో అంతస్తును దూకాడు. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. బాలుడు రోడ్డుపై పడటం చూసిన ప్రజలు అతడిని అత్యవసర చికిత్స కోసం తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు.
బాలుడిని నందానగర్ లో నివాసం ఉండే శౌర్య చౌహాన్‌గా గుర్తించారు. రెండు వారాలుగా శౌర్య పాఠశాలకు రావడం లేదని, యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. స్కూల్ హోంవర్క్‌తో భయపడిన బాలుడు స్కూల్‌కి వెళ్లడం లేదని పేరెంట్స్‌కి తెలిసిందని, భయపడిపోయి బిల్డింగ్‌పై నుంచి దూకాడని తెలుస్తోంది.