Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Indias Sun Mission Aditya L1s Spacecraft Nearing Final Phase Isro Chief

Aditya L1: చివరి దశలో ఆదిత్య ఎల్1.. జనవరి 7న చివరి విన్యాసాలు..

Published Date :November 25, 2023 , 4:49 pm
By Venu Goapl Reddy
Aditya L1: చివరి దశలో ఆదిత్య ఎల్1.. జనవరి 7న చివరి విన్యాసాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aditya L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటర్ ప్లానెటరీ మిషన్, ఆదిత్య ఎల్1 సోలాల్ మిషన్ విజయవంతంగా నిర్దేశించిన మార్గంలో వెళ్తోంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ఆదిత్యఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక చివరి దశకు చేరుకుందని, L1 కక్ష్యలో ప్రవేశపెట్టే విన్యాసాలు జనవరి 7, 2024 నాటికి పూర్తవుతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

‘‘ ఆదిత్య మార్గంలో ఉన్నాడు. ఇది దాదాపు చివరి దశకు చేరుకుందని నేను భావిస్తున్నాను,’’ అని ఇస్రో చీఫ్ మొదటి సౌండింగ్ రాకెట్ లాంచ్ 60వ వార్షికోత్సవం పురస్కరించుకుని వీఎస్ఎస్‌సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెప్పారు. L1 పాయింట్ లోకి స్పేస్ క్రాఫ్ట్‌ని ప్రవేశపెట్టే సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. జనవరి 7 నాటికి తుది విన్యాసాలు జరుగుతాయని సోమనాథ్ చెప్పారు.

Read Also: Yogi Adityanath: అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలి.. వేములవాడ ప్రజలకు పిలుపు

ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ 2న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబడింది. ఆదిత్య ఎల్1 125 రోజుల ప్రయాణించి భూమికి-సూర్యుడికి మధ్య ఉండే L1 పాయింట్(లాగ్రాంజియన్ పాయింట్) వద్ద హాలో కక్ష్యలో చేరుతుంది. ఇది భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్ వద్ద సూర్యుడు, భూమిల గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉంటుంది. దీంతో అంతరిక్ష నౌక స్థిరంగా ఎలాంటి గురుత్వాకర్షణ శక్తులకు లోను కాకుండా ఉంటుంది.

సూర్యుడిపై అధ్యయనానికి ఈ ప్రయోగం ఉద్దేశించబడింది. సూర్యుడి కరోనా, సోలార్ తుఫానులు, బ్లాక్ స్పాట్స్, సోలార్ మాస్ ఎజెక్షన్స్ వంటి వాటిపై అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించిన విలువైన సమాచారాన్ని భూమికి పంపుతుంది. సూర్యడికి సంబంధించి చిత్రాలను సేకరిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya-L1
  • Aditya-L1 solar mission
  • ISRO
  • S Somanath
  • Sun Mission

తాజావార్తలు

  • PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

  • Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..

  • Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..

  • Jayaprada Samrat: వెండితెరకు మరో వారసుడు.. జయప్రద తనయుడు సామ్రాట్ గ్రాండ్ ఎంట్రీ!

  • Rajat Patidar: “చూస్తుంటే కొట్టేలా ఉన్నాడే”.. వైభవ్ మెడ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions