Indigenous Bullet Trains: 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ ట్రైన్..
- 2026 నాటికి భారత్ మొట్టమొదటి స్వదేశీ తయారీ బుల్లెట్ ట్రైన్..
- గంటలకు 280 కి.మీ వేగం..8 కోచ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigenous Bullet Trains: భారతదేశం తన తొలి స్వదేశీ ‘‘బుల్లెట్ ట్రైన్’’ తయారీకి సిద్ధమవుతోంది. మొదటి బుల్లెట్ ట్రైన్ బెంగళూర్‌లో తయారు చేయబడుతోందని అంతా అనుకుంటున్నారు. దీని వేగం గంటలకు 280 కి.మీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఆపరేషనల్ స్పీడ్ 250 వేగం ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది.
భారత్ మొట్టమెదటి సారిగా స్వదేశీయంగా నిర్మించబోతున్న బుల్లెట్ ట్రైన్ రూపకల్పన, తయారీ, కమీషన్ కోసం ప్రభుత్వ యాజమాన్యంలోని BEML(భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్)తో రూ. 866.87 కోట్ల విలువైన ఒప్పందం కుదరించింది. ఇండియన్ రైల్వేస్ ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఇచ్చిన ఆర్డర్ ప్రకారం.. రెండు హైస్పీడ్ ట్రెన్ సెట్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో ట్రైన్లో 8 కోచ్‌లు ఉండనున్నాయి. BEML ఒక్కో కోచ్‌కు రూ. 27.86 కోట్లు ఖర్చవుతుందని, మొత్తం కాంట్రాక్ట్ విలువలోనే డిజైన్ ఖర్చులు, వన్-టైమ్ డెవలప్మెంట్ ఖర్చులు, నాన్-రికరింగ్ ఛార్జీలు , ఫిక్చర్లు, టూలింగ్, టెస్టింగ్ సౌకర్యాల ఖర్చులను కూడా కవర్ అవుతాయని చెప్పింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Water Samples: కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో 44 గ్రామాల్లో నీటి శాంపిల్స్ సేకరణ
అహ్మదాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్లకు జపనీస్ సాంకేతికతను ముందుగా భారత్ రైల్వేలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ.. చర్చలు అసంపూర్తిగా ఉన్నాయి. దీని ఫలితంగానే భారతదేశం ఇప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసే రైళ్లను తీసుకురావాలని చూస్తోంది. ముఖ్యంగా BEML కోట్ చేసిన ధర, బుల్లెట్ రైళ్ల కోసం జపాన్ కోట్ చేసిన ధర రూ.46 కోట్ల కన్నా తక్కువ. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తులో భారతదేశం అంతటా బుల్లెట్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టులకు ఊతం ఇస్తుందని అంతా భావిస్తున్నారు.
భారత్ దేశీయంగా అభివృద్ధి చేయబోతున్న బుల్లెట్ ట్రైన్ గంటకు 280 కి.మీ వేగంతో పరుగెడుతుంది. ముందుగా అనుకున్న జపనీస్ షింకన్సెన్ E5 సిరీస్ వేగం గంటకు 320 కి.మీ ఉంది. స్వదేశీ ట్రైన్లను BEML యొక్క బెంగళూరు సదుపాయంలో ఉత్పత్తి చేస్తుంది. 2026 నాటికి డెలివరీ చేయబడుతుందని భావిస్తున్నారు. ఇవి పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ కాన్ఫిగరేషన్లను ఆధునిక సౌకర్యాలతో కలిగి ఉంటాయి, వీటిలో రిక్లైనింగ్ మరియు రొటేటబుల్ సీట్లు, నిరోధిత చలనశీలత కలిగిన ప్రయాణీకులకు వసతి మరియు ఆన్‌బోర్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌లు ఉంటాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!