Indian, Wanted In Australia For Beach Murder, Arrested By Delhi Police: ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియా బీచ్ మర్డర్ కేసుతో సంబంధం ఉన్న రాజ్విందర్ సింగ్(38)ని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. గత నెల రాజ్విందర్ సింగ్ పై ఆస్ట్రేలియా పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ ప్రకటించిన వారికి 1 మిలియన్ డాలర్ల భారీ నజరానా ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆస్ట్రేలియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ రివార్డు.
2018లో క్వీన్స్ లాండ్ లో ఆస్ట్రేలియన్ మహిళను హత్య చేసిన కేసులో రాజ్విందర్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. రాజ్విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో నర్సుగా పనిచేస్తున్నాడు. బీచ్ లో తోయా కార్డింగ్లీ(24) అనే యువతిని హత్య చేశాడు. క్వీన్స్ లాండ్ లోని వంగెట్టి బీచ్ లో ఈ ఘటన జరిగింది. బీచ్ మర్డర్ కేసుగా ఆ దేశంలో ప్రాచుర్యం పొందింది. అయితే ఈ హత్య చేసిన రెండు రోజుల తర్వాత రాజ్విందర్ సింగ్ భార్య, ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి ఇండియాకు పారిపోయాడు.
Read Also: MallaReddy IT Raids: మల్లారెడ్డి ఎన్ని కోట్లు పోగేశాడో… విచారణలో తేల్చనున్న అధికారులు
అప్పటి నుంచి ఆస్ట్రేలియన్ పోలీసులు అతడి కోసం వేట సాగిస్తున్నారు. తాజాగా 2021 మార్చిలో రాజ్విందర్ సింగ్ అప్పగించాలని భారత్ ను అభ్యర్థించింది ఆస్ట్రేలియా. ఈ ఏడాది నవంబర్ లో అందుకు భారత్ అంగీకరించింది. తాజాగా రాజ్విందర్ సింగ్ ని అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. పంజాబ్ లోని బటర్ కలాన్ కు చెందిన రాజ్ విందర్ ఆస్ట్రేలియాలో ఇన్నిస్ ఫైల్ టౌన్ లో నివసిస్తున్నాడు. అక్కడే నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.
ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత రాజ్ విందర్ పంజాబ్ లో తలదాచుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా అధికారులు, భారత అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ నిందితుడిని అరెస్ట్ చేసే విధంగా చూశారు. ఇందుకోసం పంజాబీ, హిందీ మాట్లాడే ఐదుగురు పోలీస్ అధికారులను ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నియమించింది. పలుమార్లు ఆస్ట్రేలియన్ అధికారులు భారత విదేశీ మంత్రిత్వశాఖ, సీబీఐ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు.
Delhi police special cell has arrested Rajwinder Singh, accused of killing an Australian woman in Queensland in 2018.
The Queensland police had offered AUD 1 million, the largest ever offered by the department in exchange of information about the accused. https://t.co/gcWi5b1YLj
— ANI (@ANI) November 25, 2022
Delhi police special cell has arrested Rajwinder Singh, accused of killing an Australian woman in Queensland in 2018.
The Queensland police had offered AUD 1 million, the largest ever offered by the department in exchange of information about the accused. pic.twitter.com/8gIjfwxPnl
— ANI (@ANI) November 25, 2022