Site icon NTV Telugu

Australia: F*** Off, ఇండియన్.. ఆస్ట్రేలియాలో వ్యక్తిపై జాతివివక్ష దాడి..

Racially Abused In Australia

Racially Abused In Australia

Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.

Read Also: Bhatti Vikramarka: మహిళలు రూ.6680 కోట్లు ఆదా చేసుకున్నారు.. అందరికీ శుభాకాంక్షలు!

మీడియా నివేదికలు ప్రకారం, చరణ్‌ప్రీత్ సింగ్ తన భార్యతో కలిసి కారులో నగరం తిరిగేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అతడి వద్దకు వచ్చి జాతిపరమైన దూషణలు ప్రారంభించాడు, ఎలాంటి కవ్వింపులకు పాల్పడకున్నా, నిందితులంతా కలిసి అతడిని చితకబాదారు. ‘‘f— ఆఫ్, ఇండియన్’’ అంటూ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారు. బాధితుడిని స్పృహ కోల్పోయే వరకు కొట్టారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, సొంత దేశానికి వెళ్లాలని అనిపిస్తుంది, మీరు మీ శరీరంలో ఏదైనా మార్చవచ్చు, రంగును మార్చలేరు అని చరణ్‌ప్రీత్ సింగ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం ఐదుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వ్యక్తి మెదడుకు గాయం అయింది, ముఖానికి పెద్ద ఎత్తున గాయాలు అయ్యాయి. ప్రస్తుతం, సింగ్ రాయల్ అడిలైడ్ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు.
ఈ కేసులో ఇప్పటి వరకు కు 20 ఏళ్ల వ్యక్తిన అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా నిందితులను గుర్తించే పని జరుగుతోంది. ఈ ఘటన అడిలైడ్‌లో ఇండియన్ కమ్యూనిటీలో ఆగ్రహానికి కారణమైంది. విదేశీ విద్యార్థులు, వలసదారుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Exit mobile version