Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.