NTV Telugu Site icon

Russia President: ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం..

Puthin

Puthin

Russia President: ప్రధాని మోడీని ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆహ్యానించారు. దీంతో నరేంద్ర మోడీ.. రష్యా పర్యటనకు మరోసారి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశల వర్షం గుప్పించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పుకొచ్చారు. బ్రిక్స్ సభ్య దేశాలలో సినిమా షూటింగ్‌లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా? అని మీడియా అడిగిన క్వశ్చన్ కు.. పుతిన్ స్పందిస్తూ.. బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే.. రష్యాలో భారతీయ చలన చిత్రాలకు ఎక్కువ ప్రజాదరణ ఉందని అనుకుంటున్నాను.. మాకు ప్రత్యేకంగా టీవీ ఛానెలే ఉంది. భారతీయ చలన చిత్రాలపై చాలా ఆసక్తి ఉంది.. ఈ ఏడాది మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తామని వ్లాదిమీర్ పుతిన్ వెల్లడించారు.

Read Also: IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్

ఇక, నేను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కావడానికి రెడీగా ఉన్నాను అని పుతిన్ తెలిపారు. ఈ ప్రతిపాదనపై నా స్నేహితుడు మోడీతో చర్చించాలని చూస్తున్నాను అన్నారు. మా మధ్య 100 శాతం సానుకూల ఒప్పందాలు జరుగుతాయనే నమ్మకం ఉందన్నారు. ఇక, భారతీయ చలనచిత్రాలు మాత్రమే కాకుండా వారి సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే బ్రిక్స్ దేశాలకు చెందిన చైనీస్, ఇథియోపియన్ నటులు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అలాగే, మేం థియేట్రికల్ ఫెస్టివల్ నిర్వహించాలని బ్రిక్స్ దేశాలతోనూ చర్చించాం.. సినిమా అకాడమీని కూడా త్వరలో నెలకొల్పామని వ్లాదిమీర్ పుతిన్‌ చెప్పారు.

Read Also: Jan Suraj Party Meeting: ప్రశాంత్ కిషోర్ పార్టీ సమావేశంలో టికెట్‌ పంపిణీపై రచ్చ రచ్చ

కాగా, గడిచిన 4 నెలల్లో ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది సెకండ్ టైం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తుండగా.. ఈ ఏడాది జులై నెలలో మాస్కోకి మోడీ వెళ్లారు. ఆ సమయంలో 22వ భారత్– రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. 2006వ సంవత్సరంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ ను స్టార్ట్ చేయగా.. 2010లో సౌతాఫ్రికా చేరిన చేరగా.. అది బ్రిక్స్‌గా మారింది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఈ బ్రిక్స్ లో చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో 10 దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి.