Shruti Chaturvedi: మగాళ్లతో చెకింగ్.. కనీసం వాష్‌రూమ్ కూడా వెళ్లనియ్యలేరు..
- అమెరికాలో భారత యువ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేదికి చేదు అనుభవం..
- అలస్కా ఎయిర్‌పోర్టులో పురుషులతో చెకింగ్ చేశారని ఆరోపించిన శ్రుతి..
- విచారణ సమయంలో కనీసం వాష్‌రూమ్ కూడా వెళ్లనియ్యలేరు: భారత యువ వ్యాపారవేత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shruti Chaturvedi: భారతీయ యువ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేదికి అగ్రరాజ్యం అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్‌పోర్టులో తనను ఎఫ్‌బీఐ అధికారులు సుమారు 8 గంటల పాటు అన్యాయంగా నిర్బంధించారని ఆరోపణలు చేశారు. అలాగే, పురుషులతో తనిఖీలు చేయించారు.. కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్)లో ఆమె పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
Read Also: Bhuvneshwar Kumar: ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్ చరిత్ర!
Also Read
అయితే, హ్యాండ్ బ్యాగ్‌లోని ఓ పవర్ బ్యాంక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అలస్కాలోని యాంకరేజ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది తనను అడ్డుకున్నారని శ్రుతి చతుర్వేది తెలిపింది. ఈ సందర్భంగా ఓ పురుష సిబ్బంది తనను తనిఖీ చేశారు.. వెచ్చదనం కోసం వేసుకున్న బట్టలను సైతం తీసేయమని చెప్పారు.. నా మొబైల్ ఫోన్, వాలెట్ అన్నీ లాగేసుకున్నారు. కనీసం, చెకింగ్ సమయంలో వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేది ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క ఫోన్ కాల్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.. వీటన్నింటి వల్ల నేను వెళ్లాల్సిన విమానం మిస్ అయిపోయింది అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇక, దీనికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖను ట్యాగ్ చేసింది. ఈ ఘటన మార్చ్ 30వ తేదీన శ్రుతి చతుర్వేది అలస్కా వెళ్లి తిరుగు పయనం అవుతుండగా జరిగిందని వెల్లడించింది.
Imagine being detained by Police and FBI for 8 hours, being questioned the most ridiculous things, physically checked by a male officer on camera, stripped off warm wear, mobile phone, wallet, kept in chilled room, not allowed to use a restroom, or make a single phone call, made…
— Shruti H Chaturvedii 🇮🇳 (@shrutiic29) April 8, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!