Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారత్ విజ్ఞప్తి
- మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరదాడులు
- శాంతించాలంటూ ఇరుదేశాలకు భారత్ విజ్ఞప్తి
- చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 100 రోజులైంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరగొచ్చని అంతా భావిస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని అంతా అనుకుంటే.. అందుకు భిన్నంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. జూన్ 7న ఉత్తర ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆపాలని కోరింది.
ఏప్రిల్ 8 నుంచి మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. దీంతో హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ వ్యవహారం ఇరాన్‌కు రుచించడం లేదు. లెబనాన్‌పై దాడులు ఆపితేనే శాంతి చర్చలు జరుగుతాయని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌పై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెక్కచేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్ 7 రాత్రి ఉత్తర ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగింది.
Also Read
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ఇప్పటికే మధ్యప్రాచ్యం యుద్ధంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. గ్యాస్, చమురు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి పశ్చిమాసియా అట్టుడకడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దాడులు ఆపాలని ఇరాన్, ఇజ్రాయెల్‌కు భారతదేశం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఘర్షణలు ఇప్పటికే 100 రోజులకు పైగా కొనసాగుతోంది. దీనివల్ల అపారమైన మానవీయ వేదన, ప్రాణనష్టం సంభవించింది.’’ అని భారత్ పేర్కొంది. ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ సహా అన్ని పక్షాలు తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలను వేగవంతం చేసి.. దౌత్యపరమైన పరిష్కారానికి చేరుకోవాలని సూచించింది. మధ్యప్రాచ్యంలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొనేలా అన్ని పక్షాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని.. కొనసాగుతున్న చర్చలను విజయవంతంగా ముగించి దౌత్యపరమైన పరిష్కారానికి రావాలని భారత ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.
Statement on developments in West Asia ⬇️
🔗 https://t.co/8rzSlqgnY0 pic.twitter.com/NO5XecAcVZ
— Randhir Jaiswal (@MEAIndia) June 8, 2026
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!