తాజా సర్వే: తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. ఆ ఇద్దరికి షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ ఎన్నికలు వచ్చినా సర్వేలు కామన్.. కొన్ని పార్టీలు, నేతలు సర్వే ఏజెన్సీలను సంప్రదించి మరీ సర్వేలు చేయించుకోవడం చూస్తుంటాం.. తమ పరిస్థితి ఏంటి? ఎన్నికలకు వెళ్తే ఏం జరగబోతోంది? అనేదానిపై ఓ అంచనాకు వస్తుంటారు.. అయితే, ఎన్నికలు లేని సమయంలోనూ సర్వేలు జరుగుతూనే ఉంటాయి.. పార్టీలు, నేతలు, పాలన, ప్రభావితం చేసిన అంశాలు.. ఇలా కొన్నింటిని ఎంచుకుని సర్వే చేస్తుంటారు… అయితే, తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే.. ఏ పార్టీ పరిస్థితి ఏంటి? అనేదానిపై ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఆ ఫలితాల ప్రకారం తెలంగాణలో బీజేపీ పుంజుకోగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురుదెబ్బ తప్పదని తేల్చింది.
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. భారతీయ జనతా పార్టీ 6 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.. అంటే.. బీజేపీ అదనంగా రెండు స్థానాలను గెలుచుకోనుంది.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎదురు దెబ్బతప్పదని తేల్చింది ఇండియా టుడే- సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 9 సీట్లలో సత్తా చాటగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒక స్థానం కోల్పోయి 8 స్థానాలకే పరిమితం కానుంది.. ఇక, కాంగ్రెస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ సీట్లు గెలుపొందగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం రెండు స్థానాలకే పరిమితం అవుతుంది స్పష్టం చేస్తున్నాయి సర్వే ఫలితాలు.. కాగా, తెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైంది.. నేతల ప్రసంగాలు, ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే.. ఇక, త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయా? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే ఇంకా చాలా సమయమే ఉంది.. మరి.. అప్పటి వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ? ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుపొందే అవకాశం ఉందో..? విన్నర్ ఎవరు? ఎవరికి ఓటమి తప్పదు అనేది వేచి చూడాల్సిన అంశమే.
Also Read
- Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
తాజావార్తలు
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!