Site icon NTV Telugu

India Pakistan Tension: కరాచీ పోర్టుపై హైరానా.. పాక్ వైపుగా భారత యుద్ధనౌకలు.!

Ind

Ind

India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Read Also: IMF: పాకిస్తాన్‌కి 1 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ రుణం.. భారత్ హెచ్చరికలు బేఖాతరు..

అయితే, ఇండియన్ నేవీకి చెందిన పశ్చిమ నౌకదళం అరేబియా సముద్రంలో యాక్టివ్ అయిందని, పాక్ వైపుగా తరలిస్తున్నట్లు బ్రిటిష్ వార్తాపత్రిక ది టెలిగ్రాఫ్ నివేదించింది. పాకిస్తాన్ వాణిజ్యంలో దాదాపు 60 శాతం, పాక్ నేవీకి కేంద్రంగా ఉన్న కరాచీకి దగ్గర వచ్చినట్లు నివేదించింది. ఈ నేవీ ఫ్లీట్‌లో విమాన వాహక నౌక, డిస్ట్రాయర్లు, యుద్ధ నౌకలు, జలంర్గాముల్ని గుర్తించే నౌకలు ఉన్నట్లు బ్రిటిష్ పత్రిక పేర్కొంది. పాక్ తీరం నుంచి దాదాపుగా 300-400 మైళ్ల దూరంలో ఉన్నాయని చెప్పింది. ఈ నౌకలో కొన్ని బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నట్లు నివేదించింది. బ్రహ్మోస్ మాక్ 3 వ వేగంతో 500 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు, 300 కిలోల వార్ హెడ్‌ను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది.

అయితే, ఈ నివేదికను పాక్ మీడియా కూడా హైలెట్ చేస్తోంది. దీంతో పాక్ మీడియా కరాచీ పోర్టుపై నానా హైరానా చేస్తోంది. కరాచీపై ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్‌కి వినాశకరమైన పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version