Oil Imports: భారత్-అమెరికా ఆయిల్ ఘర్షణలో గెలిచిన సౌదీ అరేబియా..
- రష్యా నుంచి తగ్గిన భారత చమురు దిగుమతులు..
- అమెరికా భారత్ చమురు ఘర్షణలో సౌదీ విజయం..
- సౌదీ అరేబియా నుంచి పెరిగిన చమురు కొనుగోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil Imports: భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందనే కోపంతో గతంలో అమెరికా భారత్‌పై 25 శాతం అదనపు సుంకంతో పాటు మొత్తం 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించింది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తానని హామీ ఇచ్చిందని అమెరికా చెబుతోంది. మరోవైపు, భారత్ తమ నుంచి చమురు కొనుగోలును ఎక్కడా ఆపేస్తామని చెప్పలేదని రష్యా చెబుతోంది.
ఇదిలా ఉంటే, భారత్ చెప్పకున్నా గతంలో పోలిస్తే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. 2022 తర్వాత భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులు అత్యల్ప స్థాయికి పడిపోయినట్లు రాయిటర్స్ నివేదించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. దీని తర్వాత భారత్, చైనాతో సహా మిత్రదేశాలకు డిస్కౌంట్లపై రష్యా చమురును ఎగుమతి చేసింది. భారత రిఫైనరీలు పెద్ద ఎత్తున రష్యన్ చమురును కొనుగోలు చేశాయి.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
Read Also: Naa Anveshana Shock: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. 1.3 మిలియన్ ఫాలోవర్స్ పోయారు..
2022 తర్వాత ఒక్కసారిగా భారత చమురు దిగుమతులు రష్యా నుంచి భారీగా పెరిగాయి. అయితే, ఇది ఇప్పుడు 21 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నెలలో రష్యా నుంచి చమురు కొనుగోలు రోజుకు 11 లక్షల బ్యారెళ్లు మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు తగ్గుదల. ఫిబ్రవరి మార్చి నెలల్లో 10-12 లక్షల బ్యారెళ్ల నుంచి 8 లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ చమురు కొనుగోళ్లను పెంచింది. ఇప్పుడు, సౌదీ అరేబియా భారతదేశానికి అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా మారింది. మిడిల్ ఈస్ట్ నుంచి 2022 జనవరి తర్వాత అత్యధిక చమురును భారత్ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి నెలలో సౌదీ ననుంచి రికార్డ్ స్థాయిలో చమురు వచ్చినట్లు అంచనా. ఇప్పుడు భారత్ తన చమురు దిగుమతుల్లో 55 శాతం మిడిల్ ఈస్ట్ నుంచి, 10 శాతం లాటిన్ అమెరికా దేశాల నుంచి వస్తోంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!