Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
- జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి మాట్లాడొద్దు
- యూరోపియన్ యూనియన్‌కు భారత్ సూచన
- పాక్‌లో ఈయూ విదేశీ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. పాక్-ఈయూ సంయుక్త ప్రకటనలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘భారత్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై ఇటువంటి అనవసర వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం. జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగాలు. ఈ విషయాల్లో ఎలాంటి హక్కు లేని వారు వ్యాఖ్యానించకుండా ఉండాలి.’’ అని హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం అంగీకారయోగ్యం కావని… భారత్‌కు చెందిన అంతర్గత అంశం మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో కాజా కల్లాస్ పర్యటిస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో నదీ జలాల అంశాలపై..
ఇక భారత్-బంగ్లాదేశ్ మధ్య నదీ జలాల అంశాలపై కూడా స్పందించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉమ్మడిగా ఉన్నాయని తెలిపారు. ఈ నదులకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఉమ్మడి నదుల కమిషన్ (Joint Rivers Commission) అనే ద్వైపాక్షిక వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. నదీ జలాల వినియోగం, నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఈ ద్వైపాక్షిక వ్యవస్థ ద్వారానే చర్చించి పరిష్కరిస్తామని, భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Also Read
- PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
- Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
అమెరికా బహిష్కరణ
అమెరికా నుంచి 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను బహిష్కరించారన్న వార్తలపై స్పందించిన జైస్వాల్.. అక్రమ వలసలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. “అమెరికా నుంచి బహిష్కరణకు సంబంధించిన కేసులు వచ్చినప్పుడు మేము పూర్తిగా సహకరిస్తాం. ముందుగా వారి జాతీయతను ధృవీకరిస్తాం. వారు భారతీయులని నిర్ధారణ అయిన తర్వాత వారిని భారత్‌కు తిరిగి తీసుకుంటాం” అని తెలిపారు.
లెబనాన్‌పై ఆందోళన
లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలపై కూడా భారత్ స్పందించింది. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. “ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించాలంటే సంభాషణలు, దౌత్యపరమైన చర్చలే సరైన మార్గం. అన్ని పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముందుకు సాగాలి” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారత్ ఎప్పటిలాగే శాంతియుత పరిష్కారానికే మద్దతు ఇస్తోందని.. పశ్చిమాసియాలో స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటోందని స్పష్టం చేశారు.
#WATCH | On language used regarding J&K in Pak-EU joint statement, MEA Spokesperson Randhir Jaiswal says, "We categorically reject such unwarranted references in the Joint Press Communique on matters internal to India. The UTs of Jammu and Kashmir and Ladakh are integral and… pic.twitter.com/ZbqDCOlmmC
— ANI (@ANI) June 2, 2026
#WATCH | On Bangladesh, MEA Spokesperson Randhir Jaiswal says, "We have 54 rivers that are shared between India and Bangladesh, and we have a joint rivers commission, a structured bilateral mechanism to deal with issues pertaining to all the rivers that we share between India and… pic.twitter.com/YvalNgcx4f
— ANI (@ANI) June 2, 2026
#WATCH | On reports of 30 Indian truck drivers being deported from the US, MEA Spokesperson Randhir Jaiswal says, "India does not in any manner support illegal immigration. We cooperate with the US as and when cases of deportation are referred to us. We check the nationality.… pic.twitter.com/aHOZZAJork
— ANI (@ANI) June 2, 2026
#WATCH | On Israel military offensive in Lebanon, MEA Spokesperson Randhir Jaiswal says, "We have been closely following the developments in the West Asia region. We have been saying that dialogue and diplomacy are the way forward for the return of peace and stability." pic.twitter.com/QuY6WI0kYU
— ANI (@ANI) June 2, 2026
తాజావార్తలు
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!