India Receives Good News Amid Conflict: యుద్ధం మధ్యలో భారత్‌కు శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Receives Good News Amid Conflict: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య భారత్‌కు శుభవార్త అందింది.. హార్మూజ్ జలసంధి ద్వారా రెండు కీలకమైన వాణిజ్య నౌకలు, పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువెళ్తూ, త్వరలో భారత్‌కు చేరనున్నాయి. ఈ నౌకల భద్రతను నిర్ధారించడానికి భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతతో పని చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడుల కొనసాగుతోన్న వేళ ఈ సముద్ర మార్గంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించటం భారతదేశానికి ముఖ్యమైన విజయంగా పేర్కొనవచ్చు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ విషయాన్ని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు, గల్ఫ్ ప్రాంతంలో గత 24 గంటల్లో భారతీయ నౌకలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో సుమారు 20 భారత జెండా నౌకలు పనిచేస్తున్నాయి, వీటిలో దాదాపు 540 మంది భారతీయులు ఉన్నారు.. వీరందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24×7 కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గత 24 గంటల్లో ఈ కేంద్రానికి 98 కాల్స్ మరియు 335 ఇమెయిల్స్ వచ్చాయి.. వాటికి వెంటనే రిప్లే ఇచ్చాం.. దీనిపై ప్రభుత్వం, సంబంధిత ఏజెన్సీలు సక్రమంగా, ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు..
విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పశ్చిమ ఆసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సముద్ర మార్గంలో సురక్షితమైన నౌకాయానం కోసం భారత్ అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఇటీవల LPG సరఫరా కోసం ప్రయాణించిన నాలుగు భారతీయ నౌకలు విజయవంతంగా జలసంధి గుండా చేరిన విధానం కూడా ఇదే వ్యూహానికి అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు.. ఈ పరిణామం భారతదేశానికి కీలకమైనది.. ఎందుకంటే, ఇంధన సరఫరాలను సురక్షితంగా ఉంచడం ద్వారా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం తక్కువవుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, భారత్ చురుకైన వ్యూహంతో తన ఇంధన అవసరాలను పూర్తి చేయగలుగుతోంది.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!