Site icon NTV Telugu

India Pakistan War: రావల్పిండి ఎయిర్‌బేస్‌పై భారత్ దాడి.. లాహోర్, సియాల్‌కోట్‌లో బాంబుల మోత..

Pak

Pak

India Pakistan War: పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్‌పై దాడులు చేస్తోంది. మురిద్ బేస్, షార్కోట్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రజలు సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిపై భారీ దాడి జరిగినట్లు సమాచారం వస్తోంది.

రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌‌పై ఇండియా దాడి చేసినట్లు పాక్ ఛానెల్ సమా నివేదించింది. రావల్పిండిలోని చక్లాలా ప్రాంతంలోని ఈ ఎయిర్ బేస్ దాడి తర్వాత పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారని, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరినట్లు సమా టీవీ తెలిపింది. వైరల్ అవుతున్న వీడియోలను బట్టి చూస్తే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద శక్తివంతమైన పేలుళ్లు నమోదైనట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇస్లామాబాద్, సియాల్‌కోట్, లాహోర్, నరోవాాల్ నగరాలు కూడా బాంబు దాడులతో దద్దరిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నగరాల్లో కూడా భారీ దాడులు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని పాక్ మీడియా కూడా నివేదించింది. శుక్రవారం రాత్రి లాహోర్‌లో చాలా పేలుళ్లు వినిపించినట్లు తెలిపాయి. సియాల్‌కోట్‌లో కూడా భారీ పేలుళ్ల కారణంగా అగ్ని ఎగిసిపడుతున్న విజువల్స్ వైరల్ అవుతోంది.

Exit mobile version