India Pakistan Tension: పాకిస్తాన్ వ్యవసాయం కుదేలు.. భారత్ నిర్ణయంతో వణుకుతున్న దాయాది..
- భారత నిర్ణయంతో పాకిస్తాన్లో వణుకు..
- వ్యవసాయంపై తీవ్ర ప్రభావం..
- ఖరీఫ్‌కి ముందు దాయాదిలో పెరుగుతున్న ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan Tension: పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడి చేసింది, కానీ భారత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఊహించలేకపోయింది. పాకిస్తాన్ ఎన్ని ఉగ్రవాద దాడులకు చేయించినా, యుద్ధాలు చేసినా ఎప్పుడూ కూడా ‘‘సింధు జలాల ఒప్పందం’’ జోలికి భారత్ వెళ్లలేదు. కానీ, ఈసారి మాత్రం భారత్ పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే దెబ్బతీసింది. ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని నిలపుదల చేసింది. ఇప్పటికే, చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్, జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా క్లోజ్ చేసింది. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్‌లోని చీనాబ్ పరివాహక ప్రాంతంలో నీటి తగ్గదలను నమోదైంది.
Read Also: India Pakistan War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలపై ప్రభావం?
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ప్రధానంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అయిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నిర్ణయాలతో వణుకుతోంది. పూర్తిగా నీటిని అడ్డుకున్నా, లేక నిలిచిన నీటిని ఒక్కసారిగా వదిలేసినా పాకిస్తాన్ వ్యవసాయం కుదేలు అవ్వడం ఖాయం. ఖరీఫ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిణామాలు ఆ దేశంలో భయాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా, చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్, సలాల్ ఆనకట్టలను మూసేయడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. పాకిస్తాన్ సింధు నది వ్యవస్థ అథారిటీ సలహా కమిటీ చీనాబ్ నది ప్రవాహంలో అకస్మాత్తుగా తగ్గుదల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో పాకిస్తాన్లో 21 శాతం నీటి కొరత ఉండవచ్చని పేర్కొంది. ఇప్పటికే ఏప్రిల్ నెలలో సింధు నీటి వ్యవస్థలో 43 శాతం కొరక ఉంటుందని అంచనా వేసింది.
పాకిస్తాన్ గుండా 700 కి.మీ ప్రవహించే చీనాబ్ నది, సింధు నది వ్యవస్థకు చాలా కీలకం. పాకిస్తాన్ వ్యవసాయంలో 80 శాతం సాగునీటి అవసరాలను సింధు నది తీరుస్తుంది. సింధు నదికి ఉపనది అయిన చీనాబ్ దీనిలో కీలకం. భారత్ ఆనకట్టల్ని మూసేయడంతో చీనాబ్ నీరు తగ్గింది. దీంతో రానున్న రోజుల్లో వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటల ఉత్పత్తిని భారత నిర్ణయం తీవ్రంగా దెబ్బతీస్తుంది.
తాజావార్తలు
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!