PM Modi: భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. దేశంలోని ఆటో రంగం వృద్ధికి.. మధ్య తరగతి ప్రజల యొక్క కలను నెరవేర్చడంలో దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ ఎంతో సహకారించారని అన్నారు. ఇక, పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రతీ పెట్టుబడిదారుడికి భారత్ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.
Read Also: Pushpa 2 Re Loaded : హమ్మయ్య.. ఆ లోటు తీరింది!
ఇక, భారత్‌లో గ్రీన్ టెక్నాలజీ, ఈవీలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఆటో మొబైల్ పరిశ్రమ అభివృద్ధిలో కీ రోల్ పోషిస్తుందన్నారు. ఈ దశాబ్దం చివరి వరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్మకాలు 8 రెట్లు పెరగనున్నాయి. అయితే, గత ఐదేళ్ల క్రితం ఆరంభించిన ఫ్రేమ్-2 పథకం కింద రూ. 8 వేల కోట్లకు పైగా సబ్సిడీగా ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో 16 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయగా.. ఢిల్లీలోనే 1200 కంటే ఎక్కువ ఈవీ బస్సులు నడుస్తున్నాయని ప్రధాని మోడీ చెప్పారు.
Read Also: Bhopal : భోపాల్‌లో కుప్పకూలిన వంతెన.. తెగిపోయిన రెండు జిల్లాల సంబంధాలు.. ఇబ్బందుల్లో లక్షలాది మంది
అయితే, వేగవంతమైన పట్టణీకరణ, సరసమైన వాహనాలతో పాటు మధ్య తరగతి జనాభా పెరుగుదలతో భారతదేశం ఆటో రంగాన్ని ముందుకు తీసుకు వెళ్తుందన్నాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా, దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈవీలను ప్రోత్సహించడానికి పలు ఏరియాల్లో ఛార్జింగ్ పాయింట్లను సైతం ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోడీ చెప్పారు.