Bullet Trains: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- హైదరాబాదీలకు గుడ్‌న్యూస్
- బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
- తగ్గనున్న ప్రయాణ సమయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పుడు అంతకంటే వేగంగా దూసుకుపోయే బుల్లెట్ ట్రైన్లు కూడా భారత్‌లో పరిగెత్తబోతున్నాయి. ఇందుకు సంబంధించిన కారిడార్లను కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. 7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించింది.

Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ‘బీ35 (B35)’ పేరుతో అత్యాధునిక హైస్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నిర్ణయించింది. ఈ రైళ్ల రూపకల్పన, తయారీ కోసం సంస్థలు ఎంపిక చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. భారత్‌లోనే తయారు కానున్న ఈ B35 బుల్లెట్ ట్రైన్లు గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించనున్నారు. సాధారణ సేవల్లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని కొత్త బుల్లెట్ ట్రైన్ మార్గాల్లో ఇవే ప్రధాన హైస్పీడ్ రైళ్లుగా మారనున్నాయి.
7 కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లు
NHSRCL ప్రతిపాదనల ప్రకారం B35 రైళ్లు ఈ క్రింది హైస్పీడ్ మార్గాల్లో నడిచే అవకాశం ఉంది.
ముంబై – పుణె
పుణె – హైదరాబాద్
హైదరాబాద్ – బెంగళూరు
హైదరాబాద్ – చెన్నై
చెన్నై – బెంగళూరు
ఢిల్లీ – వారణాసి
వారణాసి – సిలిగురి
భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
ముంబై – అహ్మదాబాద్: 1 గంట 57 నిమిషాలు
ముంబై – పుణె: 48 నిమిషాలు
బెంగళూరు – చెన్నై: 73 నిమిషాలు
బెంగళూరు – హైదరాబాద్: 2 గంటల 10 నిమిషాలు
పుణె – హైదరాబాద్: 2 గంటల 8 నిమిషాలు
ఢిల్లీ – లక్నో: 2 గంటలు
ఢిల్లీ – వారణాసి: 3 గంటల 15 నిమిషాలు
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా
ఇక దేశంలోని తొలి 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లోని సూరత్-వాపి మధ్య 97 కిలోమీటర్ల విభాగంలో 2027 ఆగస్టు నాటికి బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభించాలని NHSRCL లక్ష్యంగా పెట్టుకుంది. B35 బుల్లెట్ ట్రైన్ల అభివృద్ధితో భారత్‌లోనే అత్యాధునిక హైస్పీడ్ రైళ్ల తయారీకి ఊతం లభించనుంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో వేగవంతమైన, స్వదేశీ సాంకేతికతతో రూపొందిన రైలు సేవలు అందుబాటులోకి రావడంతో రవాణా రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

తాజావార్తలు
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!