E-Air Taxis: 2026 నాటికి భారత్‌లో ఈ-ఎయిర్ టాక్సీ సేవలు.. 90 నిమిషాల కార్ జర్నీ 7 నిమిషాల్లోనే..
E-Air Taxis: పెరుగుతున్న కాలుష్యం, వాహనాల రద్దీ మొదలైనవి ప్రజల్ని ఇతర రవాణా వ్యవస్థ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. రానున్న కాలంలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరగబోతోంది. ఇదిలా ఉంటే 2026 నాటికి ఇండియాలో ఈ-ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిలువగా ఎగిరే ఈ బుల్లి విమానాలు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరులైన ఎలక్ట్రిసిటీపై ఇవి పనిచేయనున్నాయి.
READ ALSO: Kannappa: సినిమా ఏమో కానీ స్టార్లతో చంపేస్తున్న మంచు విష్ణు
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్‌లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు..
భారతదేశ ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోకి మద్దతు ఇస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, యూఎస్‌కి చెందిన ఆర్చర్ ఏవియేషన్ కలిసి 2026లో ఇండియాలో ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించనున్నట్లు కంపెనీ గురువారం తెలిపింది. రెగ్యులేటరీ క్లియరెన్స్ పొందిన తర్వాత ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవల్ని ప్రవేశపెట్టనున్నారు. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ప్రజలు సులభంగా ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీంతో పాటు కాలుష్యం కూడా ఉండదు.
ఆర్చర్ ఏవియేషన్, బోయింగ్, యునైటెడ్ ఎయిర్ లైన్స్ వంటి వాటి మద్దతుతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్(eVTOL) విమానాలను తయారు చేసింది. వీటిని అర్బన్ ఎయిర్ మొబిలిటీకి సంబంధించి భవిష్యత్తుగా భావిస్తున్నారు.
ఈ ‘మిడ్ నైట్’ ఈ-విమానాల్లో నలుగురు ప్రయాణికులతో పాటు పైలట్ 161 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 200 విమానాలతో ప్రారంభించి, వీటిని దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూర్ నగరాల్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 60-90 కారులో ప్రయాణించే దూరాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ఎయిర్ టాక్సీల ద్వారా చేరవచ్చు. ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ మరియు చార్టర్ సేవల కోసం ఇ-విమానాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది. ఆర్చర్ కంపెనీ ఆరు మిడ్ నైట్ ఎయిర్ క్రాఫ్టులను అందించడానికి జూలైలో యూఎస్ వైమానిక దళం నుంచి 142 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అక్టోబర్ నెలలో యూఏఈలో ఎయిర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.
- Tags
- Air Taxis
- E-Air Taxis
- india
- indigo
- USA
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!