Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత దర్శకుడు మారుతి ఓ ఛాన్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. పలువురి హీరోల పేర్లు వినిపించాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. రాజాసాబ్ ప్లాప్ ఎఫెక్ట్ మారుతీతో సినిమా చేసేందుకు జంకుతున్నారు హీరోలు. ఇక ఈ దర్శకుడుకి నెక్ట్స్ ఎవరు ఛాన్స్ ఇస్తారనే టైమ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మారుతీ ఓ రీజనబుల్ బడ్జెట్‌తో కొత్త కథను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.
ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు సిద్ధంగా ఉండగా ఆ తర్వాత నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ చిత్రంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరం మారుతి-వరుణ్ తేజ్ కాంబో పట్టాలెక్కే అవకాశముందని ఇండస్ట్రీలో న్యూస్ వచ్చింది. ఈ విషయమై ఆరాతీయగా వరుణ్ తేజ్ – మారుతి కాంబినేషన్ కాంబోపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వరుణ్ తేజ్ వర్గాల నుంచి సమాచారం అందింది. మారుతి తదుపరి సినిమా వరుణ్ తేజ్‌తో ఉందనడం 100% రాంగ్ న్యూస్ అని స్పష్టం చేసారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలన్నింటినీ కేవలం రూమర్లుగానే కొట్టిపారేస్తున్నారు. కొరియన్ కనకరాజ్ షూటింగ్ లో టైమ్ లో వరుణ్ తేజ్ కాలికి గాయం అయింది. ఓ వైపు ఆ నొప్పి భరిస్తూనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని బరి షూట్ లో పాల్గొంటాడు వరుణ్.
Also Read
తాజావార్తలు
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!