Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir Donation Theft Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం కేసు కీలక మలుపు తీసుకుంది.. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త సిట్‌ను ఈరోజు లేదా రేపటిలోగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు బృందానికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్.ను కొత్త సిట్ అధిపతిగా నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే దర్యాప్తును సమగ్రంగా నిర్వహించేందుకు ఆర్థిక, పరిపాలన శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులను కూడా ఈ బృందంలో సభ్యులుగా చేర్చే అవకాశముంది. రామ మందిర కానుకల దొంగతనం కేసుకు సంబంధించి నిజానిజాలను వెలికితీయడంతో పాటు దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించడమే కొత్త సిట్ ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత సిట్ సభ్యుల వివరాలు, దర్యాప్తు విధానంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!