India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives row: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది.
ప్రధాని మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి మాల్దీవుల్లో వణుకు మొదలైంది. అక్కడి మంత్రులు మల్హ షరీఫ్, మరియం షియునా, అబ్దుల్లా మహ్జూమ్ మజిద్ ప్రధానిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వివాదాస్పదమైంది. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Also Read
ఈ నేపథ్యంలో భారత్‌లోని వ్యాపారులు, ఎగుమతిదారులు మాల్దీవులతో వ్యాపారానికి దూరంగా ఉండాలని CAIT సోమవారం కోరింది. ఈ సంస్థ జాతీయాధ్యక్షుడు బీసీ భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వ్యాపారానికి ఆమోదయోగ్యం లేవని, వారి అగౌర ప్రవర్తనకు వ్యతిరేకంగా అసమ్మతి తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ‘‘అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం మరియు సహకారంపై ఆధారపడి ఉండాలి, అయితే రాజకీయ నాయకులను ఉద్దేశించి అవమానకరమైన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయి. అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాలి’’ అని ఖండేల్వాల్, భార్టియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?