LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
- ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠం..
- 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి..
- గతంలో గల్ఫ్ దేశాల నుంచే మెజారిటీ వాటా..
- సంక్షోభ సమయంలో పెరిగిన ఉత్పత్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాక్ చేయడం భారత్‌కు అనేక పాఠాలు నేర్పింది. 140 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశానికి ఇంధన భద్రత అనేది చాలా కీలకం. ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవసరాలు చమురు, గ్యాస్‌పై ఆధారపడి ఉంటాయి. ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. ముఖ్యంగా, ఎల్పీజీ గ్యాస్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందారు. అయితే, మోడీ ప్రభుత్వం ప్రజలకు గ్యాస్ కొరత రాకుండా చూసుకుంది.
యుద్ధం నేర్పిన పాఠం:
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. అయితే, ఇరాన్ యుద్ధం తీవ్రం కావడంతో భారత్ ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్ దిగుమతుల్ని పెంచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఇప్పుడు స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని వల్ల దేశ ప్రజలకు ఎలాంటి సరఫరా కొరత లేకుండా చూసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌కు వస్తూనే ఉంటాయి. దేశ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పాట్ మార్కెట్ నుంచి ఎల్పీజీ కార్గోలు జూన్, జూలై నెలల్లో భారత్ చేరుకుంటాయి.
15 దేశాల నుంచి ఎల్పీజీ:
అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతి చేసుకునేది. అయితే, ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా దేశ ప్రజలు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. భారత్‌కు ప్రతీ రోజూ సుమారుగా 80,000 టన్నుల ఎల్పీజీ అవసరం. ఇదిలా ఉంటే, దేశంలో ఉత్పత్తి దాదాపుగా 20 శాతం పెరగడం ద్వారా 46,000 టన్నులకు చేరింది.
ఇదే కాకుండా భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటోంది. గతంలో ఈ దేశాల సంఖ్య 10గా ఉండేది. యుద్ధానికి ముందు గల్ఫ్ నుంచే 90 శాతం గ్యాస్ వచ్చేది. వీటిలో ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఒమన్ దేశాలు ఉన్నాయి. ఎల్పీజీ సంక్షోభం తర్వాత నుంచి మోడీ సర్కార్ అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి దేశాల నుంచి కూడా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!