Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hema Slams Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్’ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే ప్రవర్తన ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం మీద అనసూయ మీద విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆమె స్పందిస్తూ తన మాటలను కావాలని కొందరు వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ వివాదంపై నటి హేమ కూడా ఒక వీడియో సందేశం ద్వారా అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘జై శ్రీరామ్’ అనేది కేవలం ఒక స్లోగన్ కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రమని హేమ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నామని, సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాటను జనాలు బూతద్దంలో చూస్తారని గుర్తుచేశారు. ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటే, ధైర్యంగా నేరుగా వారి పేర్లు చెప్పాలి తప్ప.. ఇలా మొత్తం వ్యవస్థను లేదా నినాదాన్ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. నోటిలో మాట వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు.
Also Read
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
చివరగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని హేమ హెచ్చరించారు. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు, ఇంతకు ఇంత తిరిగి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు దేవుడంటే భక్తి అంటూనే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండాలని చురకలేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల మధ్య జరిగిన ఈ వాడివేడి వ్యాఖ్యల యుద్ధం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!