Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- వాహనదారులకు కేంద్రం శుభవార్త
- జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- జూన్ ప్రారంభంలో ఆంక్షలు విధించిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది. జూలై 1 నుంచి ఈ ఆంక్షలు పూర్తిగా అమల్లో ఉండవని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జూనె నెల ప్రారంభంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకుండా నిషేధించింది. తమ అవసరాలకు సంబంధించిన ఇంధనాన్ని బల్క్ సేల్ పాయింట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించింది.
Also Read
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
జూన్ 11న కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ ‘మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరాపై తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్-2026’ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకేసారి గరిష్ఠంగా 90 రోజుల వరకు ఇలాంటి పరిమితులు విధించే అవకాశం కల్పించింది.
ఆంక్షలు ఎందుకు విధించారు?
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ పెట్రోలియం సరఫరా గొలుసు, నౌకాశ్రయ రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని కేంద్రం తెలిపింది. దీంతో పెట్రోల్, డీజిల్ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. రిటైల్ ధరలు, బల్క్ ధరల మధ్య వ్యత్యాసం ఉండటంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు పెద్దఎత్తున పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల సాధారణ వినియోగదారులకు సరఫరా తగ్గి స్థానికంగా ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వివరించింది.
అప్పటి నిబంధనలు ఇవే
ఆ ఉత్తర్వుల ప్రకారం పారిశ్రామిక, వాణిజ్య, సంస్థాగత వినియోగదారులు తమ అవసరాలకు సంబంధించిన పెట్రోల్, డీజిల్‌ను రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి కాకుండా బల్క్ సరఫరా కేంద్రాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉండేది. అలాగే డీజిల్ విక్రయాలను వాహనాల ట్యాంకులకు లేదా PESO (పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఒక్కో వాహనం లేదా వినియోగదారుడు రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన అమలు చేశారు. కొనుగోలు చేసిన డీజిల్‌ను తిరిగి విక్రయించడం కూడా నిషేధించారు. తాజా నిర్ణయంతో జూలై 1 నుంచి ఈ తాత్కాలిక పరిమితులు తొలగిపోనున్నాయి. దీంతో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు కూడా మునుపటిలాగే సాధారణ విధానంలో ఇంధన కొనుగోలు చేసేందుకు అవకాశం లభించనుంది.
The Ministry of Petroleum and Natural Gas has withdrawn the temporary regulatory measures governing the sale and distribution of Motor Spirit (MS) and High Speed Diesel (HSD) through retail outlets of Public Sector Oil Marketing Companies with effect from 1st July, 2026. pic.twitter.com/zgGcjs3s02
— ANI (@ANI) June 29, 2026
తాజావార్తలు
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!