PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక పర్యటన చేయనున్నారు. తాష్కెంట్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.
ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని మోదీకి ఇది నాలుగో పర్యటన కానుంది. ఈ పర్యటనలో భారత్, ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు.. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అలాగే డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి.
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
భారత్ ‘విక్షిత్ భారత్ 2047’ అభివృద్ధి దార్శనికతతో పాటు ఉజ్బెకిస్తాన్ ‘ఉజ్బెకిస్తాన్-2030’ అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఇరు దేశాల మధ్య అభిప్రాయాల మార్పిడి జరగనుంది. భవిష్యత్‌లో ఆర్థిక, సాంకేతిక, మౌలిక వసతుల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునే అవకాశాలను పరిశీలించనున్నారు. తాష్కెంట్లో ప్రధాని మోదీ పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌ను సందర్శించడంతో పాటు తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు.
ఉజ్బెకిస్తాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రిపబ్లిక్లో పర్యటించనున్నారు. కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బిష్కెక్కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. SCO 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. 2017 నుంచి భారత్ SCOలో పూర్తి సభ్యదేశంగా కొనసాగుతోంది.
SCO సమావేశంలో భద్రత, అనుసంధానం, ప్రాంతీయ సహకారం, అభివృద్ధి అవకాశాలపై భారత ప్రాధాన్యతలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ఈ సందర్భంగా SCO సభ్యదేశాల నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కిర్గిజ్ రిపబ్లిక్లో జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మధ్య ఆసియా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ క్రీడలు ప్రాంతీయ సాంస్కృతిక సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?