Mohan Bhagwat: ఇండోర్‌లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు “నేషనల్ దేవి అహల్య అవార్డు” ప్రధానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అనేక శతాబ్దాలుగా శత్రువుల దాడిని ఎదుర్కొన్న భారతదేశానికి “నిజమైన స్వాతంత్ర్యం” మాత్రం అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన తర్వాతే వచ్చిందన్నారు. భారతదేశంలో హిందువులను మేల్కొల్పడానికి రామ మందిర ఉద్యమం ప్రారంభించబడిందన్నారు. దీని వల్ల ప్రపంచ దేశాలకు మన దేశం మార్గాన్ని చూపుతుందన్నారు. గతేడాది అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశంలో ఎలాంటి విభేదాలు కనిపించలేవని మోహన్ భగవత్ సూచించారు.
ఇక, జనవరి 22, 2024న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అయోధ్య రామ మందిరం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాన్ని గ్రాండ్ అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించారు. అయితే, హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, జనవరి 11, 2025 నాటికి పవిత్రోత్సవం ఒక సంవత్సరం పూర్తి అయింది. అయితే, ఉత్తరప్రదేశ్ పట్టణంలో రామ మందిరాన్ని నిర్మించడంలో దేశంలోని ప్రతి ఒక్కరు సహాయం అందజేశారు.