Sundaram Master : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సుందరం మాస్టర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష సినిమాల్లో కమెడియన్‌గా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా వైవా హర్ష హీరోగా నటించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. ఈమె కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే కల్యాణ్ సంతోష్ టాలీవుడ్‌కు డైరెక్టర్‌గా డెబ్యూ ఇచ్చారు. ఈ సినిమాను ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్రు కలిసి నిర్మించారు.సుందరం మాస్టర్ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైంది. సినిమా మొత్తం కామెడీ జోనర్‌లో ఉంటూనే మంచి సందేశం ఇచ్చారని రివ్యూలు వచ్చాయి.
అలాగే మానవత్వం గురించి యూనిక్ కాన్సెప్ట్‌తో చెప్పారని పలువురు ప్రశంసించారు. అయితే, సినిమా అంతగా ప్రభావం చూపించలేకపోయిందని మరికొందరు నెటిజన్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కానీ, కామెడీ మాత్రం బాగుందని తెలిపారు.. మంచి కాన్సెప్ట్‌తో కామెడీ జోనర్‌లో వచ్చిన సుందరం మాస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.సుందరం మాస్టర్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఆహా మంచి ధరకు సొంతం చేసుకుందని సమాచారం. అయితే, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజాగా ఆహా అధికారిక ప్రకటన చేసింది.. సుందరం మాస్టర్ సినిమాను మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా టీమ్ తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.మాస్టర్ హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి మన ఇంటికి వచ్చేస్తున్నాడు. రెడీగా ఉండండి. క్లాసిక్ బ్లాక్ బస్టర్ సుందరం మాస్టర్ మార్చి 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది అని ట్విట్టర్‌లో ఆహా టీమ్ ట్వీట్ చేసింది. దీంతో మరో నాలుగు రోజుల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమన్న పుతిన్
🎓Master home tuitions chepaniki mana intiki ochestunaduuu….ready ga undandi
'CLASS'IC BLOCKBUSTER #SundaramMasterOnAha from March 28. 🌟@RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/2Sq1JI8tsl
— ahavideoin (@ahavideoIN) March 24, 2024
తాజావార్తలు
-
R. Narayana Murthy: ‘కామ్రేడ్’ పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
-
TG SAFE : పనీర్ పేరుతో పామ్ ఆయిల్ గేమ్.. 14 డెయిరీలపై TG SAFE దాడులు
-
Legacy: విశ్వక్ సేన్ ‘లెగసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!