భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్థాన్ భారీ స్థాయిలో నష్టపోయినట్లుగా తాజా గణాంకాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ వైమానిక దళంలో దాదాపు 20 శాతం మౌలిక సదుపాయాలు ధ్వంసం అయినట్లు సమాచారం. దాదాపు డజనకు పైగా వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. అనేక యుద్ధ విమానాలు కూడా నాశనం అయినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: IPL 2025: ఢిల్లీకి ఆస్ట్రేలియా స్ట్రోక్.. తప్పుకున్న స్టార్ ఆటగాడు
సింధ్‌లోని జంషోరో జిల్లాలోని భోలారి వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో తీవ్రంగా నష్టపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, నలుగురు వైమానిక సిబ్బందితో సహా 50 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Mukesh Ambani-Trump: ఖతార్‌లో భేటీకానున్న ట్రంప్-ముఖేష్ అంబానీ
భారత దళాలు ముఖ్యంగా ఎల్వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద బంకర్లు, పాక్ వైమానిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే పాక్ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఎల్వోసీ దగ్గర జరిగిన కాల్పుల్లో పదుల సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు భారత సైనిక అధికారులు అంచనా వేస్తున్నారు.