Delimitation: డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి లాభమా..నష్టమా..? లెక్కలు ఏం చెబుతున్నాయి..?
- డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టమా..?
- ఎలాంటి నష్టం లేదని బీజేపీ వాదన..
- దక్షిణాదిలో పెరిగే ఎంపీ స్థానాలు, వాటి వాటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation: కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో కీలక బిల్లును తీసుకువచ్చింది. మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించనున్నారు. అయితే, డీలిమిటేషన్స్ వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, విపక్షాలు మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్స్ వల్ల లోక్‌సభలో ఇప్పుడున్న 543 ఎంపీ సీట్ల సంక్య 850కు పెరుగుతుంది. ఇందులో 815 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండనున్నాయి. మొత్తం 50 శాతం సీట్ల సంఖ్య పెరగుతున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ ద్వారా 273 స్థానాలు కేటాయిస్తారు.
జనాభా ఆధారిత పునర్విభజన వల్ల, అధిక జనాభా పెరుగుదల ఉన్న ఉత్తరాదికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంందని దక్షిణాది రాష్ట్రాల వాదన. మెరుగైన జనాభా నియంత్రణ చేసినందకు మేం ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ పట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సంఖ్య పెరిగితే ఆ పార్టీకి ప్రయోజనం చూకూరుతుంది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల వాదనను పట్టించుకోరని ఆరోపిస్తున్నారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
అయితే, దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న ఎంపీ స్థానాల శాతం ప్రకారమే, పెరిగిన తర్వాత ఎంపీ సీట్ల శాతం ఉంటుందని లెక్కలేస్తున్నారు. 50 శాతం పెరుగుదలతో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

1) తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఎంపీ స్థానాలు(ఇప్పుడున్న 543)లో ఇది 7.2 శాతం. లోక్‌సభ స్థానాలు 850కి పెరిగితే, తమిళనాడులో 59 ఎంపీ స్థానాలు అవుతాయి. అప్పుడు మొత్తం ఎంపీ సీట్లలో తమిళనాడు వాటా 7.2గానే ఉంటుంది.
2) కర్ణాటకలో ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉంటే, పెరిగిన తర్వాత దీని సంఖ్య 42కు చేరుతాయి. ముందుగా 543లో 5.15 శాతం ఉంటే, 850లో 5.14 శాతం ఉంటుంది.
3) ఆంధ్రప్రదేశ్‌లో 25 స్థానాల నుంచి 38 స్థానాలకు పెరుగాయి. ఇప్పుడు ఎంపీల వాటా 4.6 శాతం ఉంటే, పెరిగిన తర్వాత 4.65 శాతం ఉంటుంది.
4) తెలంగాణలో 17 ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయి. వాటా 3.13 శాతం ఉంటే పెరిగిన తర్వాత 3.18 శాతం ఉంటుంది.
5) కేరళలో 20 నుంచి 30కి ఎంపీ సీట్లు పెరుగుతాయి. కేరళ వాటా 3.68 శాతం నుంచి 3.67 శాతం ఉంటుంది.
ఈ లెక్కల్ని చూస్తే పెద్దగా సీట్ల శాతంలో మార్పు లేదు. ప్రస్తుతం 129 ఎంపీ స్థానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే, పెంపు తర్వాత 195 సీట్లకు పెరుగుతుంది. దక్షిణాది ఎంపీ వాటా 24 శాతంగానే ఉంటుంది. మొత్తంగా వాటాలో పెద్ద మార్పు రాదు. దక్షిణాదిలో సీట్లు పెరిగినప్పటికీ దాని ప్రభావం అలాగే ఉంటుంది.
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!