Covid 19: దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత మూడు వారాలుగా కేసులు క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 2,541 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మరో 30 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,522గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,22,223కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.
వారం కిందటి వరకు దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఢిల్లీ, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు వెలుగు చూశాయి. అయితే వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్ధాన్, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. గత వారంలో దేశ రాజధాని ఢిల్లీలో 6,300కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్ కారణంగానే ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయని వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?