దేశంలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కేసులు.. ఆ సంఖ్య ఐదు వేలకు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యా్ప్తంగా 4, 866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.