NTV Telugu Site icon

Covid Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Corona Virus

Corona Virus

Covid Cases: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో16,464 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు భారీగా తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 39 మంది కరోనా బారినపడి చనిపోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,112 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.48 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు దేశంలో 2,73,888 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

Monkeypox: మంకీపాక్స్‌ వర్సెస్ చికెన్‌పాక్స్.. తేడాలేంటీ.. వైద్యులేమంటున్నారంటే?

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,26,396 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,43,989 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,33,65,890 మంది కోలుకోగా.. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,40,36,275కు చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 8,34,167 మందికి కరోనా వ్యాక్సిన్‌లు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.34 కోట్లు దాటింది. అటు ప్రపంచ దేశాల్లో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 5,79,258 మంది కరోనా వైరస్​ బారినపడ్డారు. మరో 816మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.