ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల తరువాత అత్యల్పస్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేంద్రం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది.
Read: టబు పాత్రలో మనీషా కొయిరాల!
ఇందులో 2,88,44,199 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 7,02,887 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1422 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,88,135 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్కరోజులో దేశంలో 78,190 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 28,00,36,898 మందికి వ్యాక్సిన్ అందించారు.